సాయి చరితము

సాయి చరితము

పల్లవి
మా నీడవు నీవూ
మా వెలుగూ నీవే
నీ చూపు కోసమై
నిలిచామయ్యా

చరణం
సాయి అన్న పిలుపుతో
దిగులు పోయేను
సాయంచేసే మిత్రుడై
చెంత చేరెను
ఎన్ని బాధలున్నను
తనను వదలను
చరితనే చదివితిమా
భయము పోవును

చరణం
కాలమే పరీక్షలు
ఎన్ని పెట్టినా
సాయినామమొకటే
కాపాడునుగా
నీవే శరణు అన్నచో
వెంట ఉండుగా
ద్వేషమయ జగతిలో
ప్రేమనిచ్చును

చరణం
సన్మార్గము చూపుచూ
సరిదిద్దునుగా
మన ఆశలు కోరికలు
తనకు తెలియుగా
భారమే వేసితిమా
దారి చూపుగా
బతుకంతా వెలుగునిచ్చి
ఆదుకొనునుగా

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *