సాయం
ప్రార్థించే పెదవులకన్నా
సాయం చేసే చేతులే మిన్న
ఆపదలో ఉన్న వాని ఆదుకో అన్న
కష్టేఫలి అని తెలుసుకో మిన్న
స్నేహితులని మించిన సాయం
ఇరుగుపొరుగు మించిన సాయం
గొప్పది అని తెలుసుకో
ఆడంబరాలు విడిచిపెట్టు
ఆత్మీయతను పంచిపెట్టు
సభ్య సోదర భావం అల మరిచిపో
స్త్రీని అమ్మవలె చూచుట నేర్చుకో
ఆకలి వేసిన వానికి పట్టెడ అన్నం పెట్టు
ఆందోళనగా ఉన్న వానికి గ్లాసుడు నీళ్లు ఇవ్వు
జీవితంలో మంచి సాయం
జీవితంలో మంచి స్నేహం
కడవరకు ఉండగలదు గుర్తు
అది మర్చిపోని మధురమైన సహాయ మెట్టు
– యడ్ల శ్రీనివాసరావు