సగటు ఆడపిల్ల కథ

సగటు ఆడపిల్ల కథ

ప్రతి ఆడపిల్లకు ఎన్నో కోరికలు ఉంటాయి వాటిని తీర్చుకునే అవకాశం ఉన్నా కొన్ని పరిస్థుతుల వల్ల తీరకుండా ఉంటాయి అలాంటివే నా ఈ కోరికలు …

నేను ఒక మామూలు ఆడపిల్లను నాకు కోరికలు ఆశలుంటాయి నాక్కూడా మామూలుగా మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది కానీ మా ఇంటి పరిస్థితి బాగా లేక మామూలు బట్టలు వేసుకునే దాన్ని , ఇంటికి పెద్ద కూతుర్ని అయినందువల్ల మా నాన్న నన్ను గారాబంగా పెంచారు ఏది అడిగినా కాదనకుండా కొని ఇచ్చేవారు , మా ఇంట్లో మా అమ్మకి  నాన్నకి అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి అప్పుడు ఏమి తెలియలేదు కానీ  తర్వాత తర్వాత అర్దం అయ్యింది.

అనుమానంతో మా నాన్న మా అమ్మ ను కొడుతూ ఉండేవాడని అయినాకూడా నా కోరికలో మార్పు ఉండేది కాదు నేను పెద్ద మనిషిని అయ్యా మా అమ్మ ఎవరినీ పిలవకండి అని అన్నది కాని నేను ఊరుకోకుండా అందరినీ పిలిపించమని మా నాన్న ముందు ఏడిచే సరికి నాన్న మా నాన్నమ్మ వాళ్ళని పిలిపించారు ఉత్తరం రాసి మరి వాళ్ళు వచ్చాక  తాగుడు తినుడు చాలా ఖర్చు వచ్చింది.

HD Crying Sad Girl Image | Free Download HD Sad Girl Images … | Flickr

మా నాన్న కి ఫంక్షన్ ఉన్న నాలుగు రోజులు వాళ్ళు బాగా తిని  తాగి ప్లేట్స్ పగలగొట్టారు మా అమ్మని బాగా కొట్టి బయటకి పంపేశారు అయినా  ఇంట్లోంచి బయటకి వెళ్ళొదని చెప్పినా నేను వెళ్లి మరీ మా అమ్మ ని పిలుచుకుని వచ్చాను.

నాకేం ఆశ అంటే అందరూ మంచిగా ఉంటారేమో అని అనుకుని రమ్మన్నా  కానీ జరిగింది ఇంకొకటి నేను నా ఫంక్షన్ అయ్యాక మళ్ళీ స్కూల్ కి  వెళ్తున్నప్పుడు మా ఊర్లో ఒక సీ. అర. పీ. ఏఫ్ కానిస్టేబుల్ లు వచ్చారు  వాళ్ళు ఉరి బయట కాటేజీ ల్లో ఉండే వాళ్ళు వాళ్ళు మా ఖాతా షాప్ లో కి వచ్చి సామానులు తీసుకొని వెళ్లేవారు అలా నేను కూడా షాప్ కి వెళ్లినప్పుడల్లా నాతో మాట్లాడే వాళ్ళు , అలా వాళ్ళతో మెల్లిగా పరిచయం అయ్యింది.

అందులో ఒక అతను బాబు అతని పూర్తి పేరు చంద్రబాపు నాయుడు  అని చెప్పాడు  మెల్లిగా అతనికి అట్రాక్ట్ అయ్యాను అతను కూడా నన్ను బాగా గమనించాడు మా ఇంటి పరిస్థితి చూసి నన్ను మాటలతో మాయ చేశాడు  అప్పటి నా పరిస్థితి ఏమిటంటే నాతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు నేను టినజ్ లో ఉన్న  నా శరీరం లో వచ్చే మార్పులు  నాకు తెలుస్తూనే ఉన్నాయి కాబట్టి అతను ప్రేమగా మాట్లాడేసరికి కొంచం ప్రేమ చూపించేసరికి నేను తనకి దగ్గర అయ్యాను  మా ఇంట్లో మా నాన్న అమ్మ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

మా ఇద్దరూ తమ్ముళ్ళని అందరూ చీప్ గా చూస్తున్నారు నన్ను కూడా అదోలా మాట్లాడుతున్నారు ఒక ఇంటి యజమాని బాగా లేకపోతే తండ్రి తన పాత్ర బాగా పోషించలేకపోతే  ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో మనుషుల గురించి అందరూ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు అని మా తమ్ముళ్లు బాధ పడ్తు చెప్తున్నారు మా నాన్న అమ్మ తప్పు ఏమి లేకపోయినా తాగి బాగా కొట్టేవాడు అక్రమసంబంధాలు అంటగట్టి తిట్టేవారు.

Just a girl with a dream!!!!! | The more you give away the m… | Flickr

అసలు సంగతి ఏమటంటే మా అమ్మ మా నాన్నగారికి రెండో భార్య  మొదటి భార్య ఇలాగే నాన్న తాగుతుంటే చూసి రక్తం పడడం తో భయపడి వెళ్లిపోయింది దాంతో ఆ విషయం దాచి మా అమ్మ ను పెళ్లి చేసుకున్నాడు  తెలిశాక ఇక ఏమి చేయలేక అమ్మమ్మ వాళ్ళు అమ్మతో ఎలాగో సంసారం చేసుకోమని అమ్మ కి చెప్పి చేతులు దులుపుకున్నారు దాంతో అమ్మ ఎవరి సపోర్ట్ లేకపోవడం తో  ఓపిక గా నాన్న పెట్టే భాధలు పడుతూనే ఉంది.

అది మా ఇంటి కథ నాన్న కు అనుమానం అనే రోగం వాళ్ళ నన్ను కూడా ఓ కంట కనిపెడుతూ నే ఉంటాడు. దాంతో నేను స్కూల్ లో కూడా ఎవరి తో ను మాట్లాడకుండా ఉండే దాన్ని నేను ఎవరితో  మాట్లాడినా ఆ రోజు ఇక అందరికీ తన్నులే  కాబట్టి భయం భయం గా ఉండే వాళ్ళం ఇలా జరుగుతుండగానే …

నా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ లో వేరే ఊరిలో జాయిన్ చేశారు అయినా నిఘా తప్పలేదు. అయినా సరే ఏదో విధంగా మేము మాట్లాడుకునే వాళ్ళం మా నాన్న కొంచం మారారు అదే టైంలో నేను ఇంట్లో అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాను స్పెషల్ క్లాస్ లు ఉన్నాయి అని చెప్పి తనతో గంటలు  గంటలు మాట్లాడుతూ కూర్చునే దాన్ని కాని ఎప్పుడు హద్దులు దాటలేదు అప్పుడు అలా చేయాలని కూడా ఉండేది కాదు.

ఎందుకంటే అందరికీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే వారు అప్పట్లో ఒక అబ్బాయితో మాట్లాడం అంటే లవ్ అనే భ్రమతో ఉండే వాళ్ళు అలా బాయ్ ఫ్రెండ్ ఉండడం కూడా ఒక గర్వం గా ఉండేది నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉండేదాన్ని బస్ ఎక్కినట్టే ఎక్కి మద్యలో దిగి తనతో మాట్లాడేదాన్ని  అలా చాలా రోజులు గడిచాయి. ఒక రోజు మామూలుగా మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు .

సగటు ఆడపిల్ల కథ

నేను వెంటనే ఛీ ఛీ ఏంటిది ఇవన్నీ పెళ్లయ్యాకే ఇలా చేయడం నాకు నచ్చదు అంటూ కోపంగా ఇంటికి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఒక వారం రోజులు మాట్లాడలేదు తనతో  తనే నన్ను బ్రతిమాలడం తో నేను కొంచం తగ్గాను తనతో  మళ్లీ మాట్లాడేలా చేసుకున్నాడు. ఆ తరువాత వారానికి నేను మా అమ్మ వాళ్లతో మన పెళ్లి విషయం మాట్లాడి వస్తాను అని నాకు చెప్పి వెళ్లిపోయాడు ఒక నెలరోజులు గడిచాయి వస్తానని చెప్పిన వాడు రాలేదు నేను ఇక ఉండబట్టలేక వాళ్ళ ఫ్రెండ్ ని అడిగాను దానికి అతను అయ్యో నీకు తెలీదా వాడికి ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళిపోయాడు ట్రాన్స్ఫర్ గురించే ఇన్ని రోజులు ఎదురుచూశాడు. ఇప్పుడు ఇక వాళ్ళ సొంత ఊరిలో అమ్మానాన్నలతో భార్యతో సంతోషంగా ఉండి ఉంటాడు అని అన్నాడు.

Mystical Portrait Of A Girl Eyes - Free photo on Pixabay

భార్యనా? తనకి తనకి పెళ్లి అయ్యిందా?అని నేను తెల్లబోయి అడిగాను  అవును నీకు తెలియదా? వాడికి పెళ్లి అయ్యి సంవత్సరం అయ్యింది నీతో చెప్పి ఉంటాడు అని అనుకున్న నేను , నేను నాకు తెలియదు అన్నయ్య అని గొణిగాను  మరి నాతో మాట్లాడాడు కదా అని అడిగాను.

దానికి అతను బిత్తరపోయి చూడమ్మా నేను నీతో ఎన్నో సార్లు చెప్పాలని చూసా కాని వాడే చెప్పనివ్వలేదు వాడు నిన్ను జెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాడు  నువ్వేదో ఊహించుకుని ఉంటావ్ అవును మీ మద్య ఏదైనా రెలేషన్ ఉందా ? అదే ముద్దులు హగ్ లు అలాంటివి అని అడిగాడు లేదు నేను దూరంగానే ఉన్నా అని చెప్పా అతనితో అలా చెప్పాలని  అసలు అలా చెప్తారని నాకు అప్పుడు తెలియదు .

కానీ లేదని చెప్పేసరికి సరే అయ్యింది ఏదో అయ్యింది ఇప్పటికీ వాడిని మర్చిపోయి మంచిగా చదువుకో మీ నాన్న మంచివాడు కాదని విన్నా ఒకవేళ ఈ సంగతి తెలిస్తే ఇక నిన్ను కాలేజ్ కి పంపడు అందుకే అన్ని వదిలేసి చదువుకో అని చెప్పి ఇలా ఎవరైనా ఏదైనా చెప్పినా నమ్మకు సరేనా అని నాకు అన్ని విధాలా నచ్చ చెప్పి నేను కూడా రేపు వెళ్లిపోతున్నా అందరూ నాలాగ ఉండరు నువ్వు నన్ను అన్నయ్య అన్నవ్ కాబట్టి ఈ విషయాలు చెప్తున్న జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు అతను చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చి ఏడుపు వచ్చింది అలా రాత్రంతా ఏడుస్తూ పడుకున్నా…….

మెల్లిగా అతని ఆలోచనల నుండి బయటకి వచ్చి చదువుకుంటున్నా ఎలాగోలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా  ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా కొంచం రేజర్వెడ్ గా ఉండ సాగాను అది నచ్చిందేమో డిగ్రీ చదివే ఒక అబ్బాయి రోజు వెంట పడేవాడు నేను బస్ దిగిన దగ్గరినుంచి క్లాస్ కి వెళ్ళే దాకా వెంట వచ్చేవాడు మళ్ళీ లంచ్ లో చూసేవాడు నేను చూసి  చూడనట్టు ఉండేదాన్ని.

Girl Sadness Loneliness - Free photo on Pixabay

ఎందుకంటే ఒకసారి మోసం అయ్యిందని మళ్ళీ సాయంత్రం బస్ స్టాప్ వరకు బైక్ మీద ఫాలో అయ్యేవాడు ఇలా మూడు నెలలు గడిచాయి తన స్నేహితునితో రాయబారం పంపాడు జెస్ట్ స్నేహితుల్లాగా ఉందాం అని తనతో మాట్లాడమని  సరే నాకన్నా అందగా ఉన్నాడు కాలేజీ అమ్మాయిలు అతనితో మాట్లాడాలని చాలా తపన పడేవారు వాళ్ల క్లాస్ అమ్మాయిలు కూడా అతనికి లైన్ వేసే వాళ్ళు.

అలాంటి వాడు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకోవడంతో నాకు ఒక లాంటి గర్వం వచ్చింది. అంతమందిని వదిలేసి అతను నాకు మాత్రమే ప్రపోజ్ చేస్తున్నాడంటే నేను అంత అందంగా అయినా ఉండాలి లేదా నా  మొహమాట మైన అతనికి నచ్చి ఉండాలి అని అనుకొని తన ఫ్రెండ్ కి ఓకే అని చెప్పాను ఫ్రెండ్ గా ఉండడం నాకు ఇష్టమే కానీ అంతకన్నా హద్దులు మీరకూడదని కండిషన్ పెట్టాను. సరే నన్ను అతను వెళ్లి అతనికి చెప్పాడు.

ఇక అప్పటినుండి మేము సినిమాలకు షికార్లకు తిరిగేవాళ్ళం  నాది ఇంటర్లో బైపీసీ కాబట్టి స్పెషల్ క్లాస్ అని చెప్పి అతనితో బయటకు వెళ్ళేదాన్ని లేట్ అయితే బండి మీద ఇంటి వరకు డ్రాప్ చేసేవాడు అంటే ఇంటి ముందు కాదు రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయాడు నేను నడుచుకుంటూ ఇంటికి వచ్చేదాన్ని మా నాన్న అడిగేవారు ఇంత లేట్ అయిందని నాకు స్పెషల్ క్లాస్ అని చెప్పి దాని మా నాన్న మారారు కాబట్టి ఆ మాటలు నమ్మేవారు నా మీద నిఘా తీసేసారు ఎందుకో తెలియదు.

సగటు ఆడపిల్ల కథ

ఇలా కొన్ని రోజులు లు చాలా చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళ ఇంటికి కూడా తీసుకు వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలకు పరిచయం చేశాడు వాళ్ల పొలాలను చూపించాడు ఇక సినిమాలైతే అప్పుడే ఎగిరేపావురం సినిమారిలీజ్ అయింది నా పుట్టినరోజు కానుకగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూపించాడు ఆ తర్వాత చాలా సినిమాలు చూసాను కాలేజీ బంక్ కొట్టి మరి చూశాను కానీ ఇంత తిరుగుతున్న హద్దు మీరలేదు అతను తన మాటకి కట్టుబడి ఉన్నాడు అని అనిపించింది.

ఇక పరీక్షల హడావుడి మొదలైంది లాస్ట్ ఎగ్జామ్స్ మాకు సెంటర్ వేరే ఊర్లో పడింది అంటే నేను రెండు బస్సులు మారి వెళ్లాలి ఒక ఊరి కంటే బస్సులో వెళ్లొచ్చు కానీ ఇంకో బస్సు మరి వెళ్లాలంటే టైమ్ సరిపోదు ఎగ్జామ్ ఎనిమిది గంటలకు మొదలవుతుంది ఎలారా భగవంతుడా అనుకుంటే తానే నన్ను డ్రాప్ చేయడం మొదలుపెట్టాడు. ఒక రెండు రోజులు డ్రాప్ చేసిన తర్వాత తిరిగి పికప్ చేసుకోవడానికి వచ్చాడు రెండో రోజు పరిక్ష అయినాక తిరిగి వెళ్లేటప్పుడు ఒక దగ్గర బైక్ ఆపి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు.

నేను బిత్తరపోయి అదేంటి మనం ఫ్రెండ్స్ అనుకున్నాం కదా మళ్లీ ఇది ఏంటి ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?  నేను నిన్ను ఎప్పుడూ అలాంటి దృష్టితో చూడలేదు? నువ్వు అలాంటి దృష్టితో ఉంటే మాత్రం నేనేం చేయలేను !ఐ యామ్ సారీ! అలా అయితే నాకు ఏ సహాయం చేయడం అవసరం లేదు అని చెప్పి అక్కడినుంచి వచ్చే బస్సు ను అపి ఎక్కి వెళ్ళిపోయాను ఆ తర్వాత రెండు రోజులు హాలిడేస్ వచ్చాయి ఎగ్జామ్స్ లేవు నేను ఏ ఆలోచనలు పెట్టుకోకుండా చదువుకుంటున్నాను .

రెండు రోజుల తర్వాత మూడోరోజు ఎగ్జామ్ కి వెళ్లాను అతను వచ్చాడు ఏమో అని చూశాను కానీ రాలేదు నేను అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఎగ్జామ్స్ అయిన అన్ని రోజులు తను రానేలేదు ఇక చివరి పరిక్ష ఎగ్జామ్ అయిపోతే ఇక కాలేజీ కి నాకు రుణం తీరిపోయినట్టు తనని మళ్లీ చూడలేను నేను అని అనుకొని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తను ఎందుకు రావడం లేదో ఒక సారి తనని చూసి  మాట్లాడాలని ఉంది అని అడిగాను.

Portrait Of A Girl Hair - Free photo on Pixabay

అతను నన్ను చూసి ఏం మాట్లాడతావ్? తనతో నువ్వు ఎక్కడ ఉన్నాడని? మాట్లాడతావు? తను లేడు నువ్వు కాదన్నా వు అన్న బాధలో తన సూసైడ్ చేసుకున్నాడు ఆ విషయం కూడా నాకు చెప్పి నీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ విషయం నీకు చెప్పమని నాతో ప్రామిస్ చేయించుకున్నాడు అని చెప్పాడు.

దానికి నేను ఏడుస్తూ అన్నయ్య  నేను అతనితో  ముందే చెప్పాను లవ్ లేదు ఏమి లేదు జస్ట్ ఫ్రెండ్ షిప్ అని అంటేనే తనతో నేను మాట్లాడాను ఇప్పుడు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి ?

ఇదంతా నాకు కలలాగా ఉంది అయినా నేను తనతో ఎప్పుడూ అలా మిస్ బిహేవ్ చేయలేదు అని చెప్పాను  దానికి ఆ అన్నయ్య అవునమ్మ వాడు  కూడా ముందు ఫ్రెండ్షిప్ అనుకున్నాడు కానీ ఆ తర్వాత తర్వాత మెల్లగా ఆశలు చిగురించాయి.

వాడు నిన్ను ప్రేమిస్తున్నానని నాతో ఎన్నో సార్లు చెప్పాడు నన్ను చెప్పమని నాతో చాలా బ్రతిమాలాడు  చెప్పావా అంటూ  చాలా అడిగాడు కానీ నేనే లేట్ చేశాను అందుకే అంత శిక్ష విధించాడు మేమిద్దరం చిన్నప్పటి నుండి మంచి స్నేహితులం నాతో అన్ని షేర్ చేసుకునేవాడు ఇలా చేశాడంటె నేనె నమ్మలేకపోతున్నా  ఇక నువు ఎంత నీ తప్పు ఎమి లేదు వాడిదే తప్పంతా ఫ్రెండ్షిప్ ని లవ్ ఆనుకున్నాడు అందుకే వెళ్ళిపోయాడు అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకున్నారు నేను కూడా బాగా ఏడ్చాను.

తను నన్ను ఓదార్చే ఇంటికి వెళ్లి అమ్మ అని అన్నాడు  నేను అక్కడి నుంచి భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నాను. మేము తిరిగిన అందువలనో ఎగ్జామ్స్ సరిగా రాయలేక పోయినందున నేను ఇంటర్ తప్పాను మళ్లీ పరీక్షలకి కట్టమని మా నాన్న ఎంత మొత్తుకున్నా నేను చదవనని చెప్పేశాను దాంతో మా నాన్న నన్ను ఏమీ అనలేక నీ ఇష్టమని వదిలేశాడు. ఒక సంవత్సరం అంతా అతనిని అతని బాధతోనే గడిపేశాను. ఇది  మా అమ్మ అది గమనించి ఏంటి ఏమైంది అని అడిగింది నేను జరిగిందంతా అమ్మకు చెప్పేశాను ఎందుకంటే తల్లి కన్నా మంచి స్నేహితురాలు ఈ ప్రపంచంలో లేదు.

ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్న తల్లిని మించిన స్నేహితురాలు ఆ టైంలో ఎవరూ లేరు అనిపించి అమ్మకు అన్ని విషయాలు చెప్పాను. అమ్మ జరిగిందేదో జరిగింది అతని తప్పే ఉంది కానీ నీ తప్పేమీ లేదు నువ్వు జరిగింది ఆలోచిస్తూ కూర్చుంటే నీ భవిష్యత్ ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు ఇంటికి పెద్ద కూతురువి  నిన్ను చూసి తమ్ముళ్లు నేర్చుకోవాలి కానీ నీకు ఇంకొకరు చెప్పకూడదు అని నన్ను మెత్తగ మందలించి భవిష్యత్తు బోధించి నాలో కొత్త కోణం చూపించింది.

సగటు ఆడపిల్ల కథ

✓ Portrait Grayscale Photography Of A Girl Looking Up Person Image - Free Stock Photo

ఇక ఇంటర్ చదవనని అనిపించి ప్రైవేట్ గా డిగ్రీ కి కట్టాను అలాగే అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో విద్యా వాలంటీర్ గా చేరాను రోజూ స్కూలుకు వెళ్లడం ఇంటికి రాగానే చదువుకోవడం ఇదే నా పని అయింది డిగ్రీ పూర్తి చేశాను ఆ తర్వాత బ్యాంక్ జాబ్స్ పడ్డాయి. వాటికి అప్లై చేయమని మా నాన్నగారు ఫామ్స్ తెచ్చి ఇచ్చారు నేను అప్లై చేయడం ఇంట్లోనే చదువుకుని  ఎగ్జామ్స్ రాశాను కానీ ఫలితాలు వచ్చే లోపునే మా నాన్న నన్ను మా బావ కి ఇచ్చి పెళ్లి చేసారు.

ఆడపిల్ల కి కోరికలు ఉంటాయి కానీ తీర్చుకునే తెలివి కొందరికే ఉంటుంది చదువుకునే వయసులో ఆకర్షణ కి లోనూ కావడం వల్ల నేను నా తెలివి తేటలను భవిషత్తు ని కోల్పోయాను అదే నేను మంచిగా చదివి ఉంటే ఇప్పుడు మంచి డాక్టర్ గా,లేదా మంచి ఆఫీసర్ గా   మారి ఉండేదాన్ని కదా ! అందుకే ఏ వయసులో జరిగేది అదే వయసులో అది మాత్రమే చేయాలి  నాలాగ ఆకర్షణకు లోనైతే పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను పిల్లలకి వండి వార్చుతూ మా వారి తో తిట్ల పురాణం తింటూ బ్రతుకుతున్నా ఇది నా బతుకు.

-భవ్య చారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *