సాయిచరితం

సాయిచరితం

పల్లవి:
మా తనువు మనసును
కాపాడవయ్యా
మార్గమే చూపి ఆదుకోవయ్యా
సాయే శరణం..సాయే దైవం

చరణం:
నీ చరితే నింపును మాలోన ధైర్యము
నీవే మావెంటుండే పోరాడే సైన్యం
షిరిడీయే మనకు ఇలవెలిసిన స్వర్గం
నిన్నేమో చూడాలని మనసుదో స్వప్నం

చరణం:
అందరీ దైవమూ ఒకటే అంటావు
భేదభావనలు వలదే వలదంటావు
ఓపికే లేని బతుకులు మావయ్యా
బతిమాలుకుంటాము నీ బాటను చూపమని

చరణం:
బంధమై మావెంట ఉంటేను నీవు
ఊరడిల్లుతాము.. సేదదీరుతాము
వర్తమాన వెలుగువై మా గుండె నుండు
సందేహ బతుకుల్లో సందడే విరియును

చరణం:
ఊపిరై నీవుంటే ఊయలే ఊగేము
వెన్నెలై నీవుంటే వెతలన్నీ దూరమిక
వన్నెచిన్నెల రేడు మా సాయినాధుడు
మా కోసం వెలసిన సద్గురుమహరాజువే

– సి. యస్. రాంబాబు

Related Posts