సాయి చరితము

సాయి చరితము

పల్లవి
సాయము చేసే సాయిని
ఎంతని కీర్తించెదము
ధైర్యమునిచ్చే సాయిని
ఎంత పొగిడినా చాలదు

చరణం
నీడగ ఉంటాడండీ
మనవే వింటాడండీ
మౌనముగా ఉంటాడండీ
మంచే మనకు చేస్తాడు

చరణం
కాలగతిలో మనము
కలిసిపోతుంటాము
కాలాన్నే శాసిస్తాడు
మన బాగును ఆశిస్తాడు

చరణం
ఆపదలెన్నో వస్తాయి
కష్టాలను అవితెస్తాయి
సాయినాధుడే ఆనగా
ముందుకు సాగిపోదాము

చరణం
రేపేమిటో మనకు తెలియదు
సద్గురు సాయే తెలుసును
ఆ విశ్వాసముతో మనము
బతుకును దిద్దుదాము

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *