సాయి చరితము 

సాయి చరితము 

పల్లవి
మావెంటే ఉండు సాయి
మా సర్వము నీవే సాయి
మాదైవము నీవే సాయి
తనివితీరని రూపము నీది సాయి

చరణం
మా గమనములోన గగనము
నీవేనయ్యా
బతుకే గండము అని భావిస్తే
అండగ తోడుంటావు
తోబుట్టువుగా వెంటే ఉండే
మమతల కోవెల నీవు
నీ నామమునే నిత్యము తలచి
ధన్యులమైతిమి మేము

చరణం
నీ చరితమునే చదివిన మాకు
సంతసమంతా కొలువైయుండును
నీ దర్శనమే చేసిన చాలును
ఊపిరాడని క్షణములు తొలుగును
వేడుకచేసే ఉదయకిరణములు
వెంటే వచ్చును సాయి
చీకటినిండిన జీవితమ్మున
వెన్నెల సోనలు కురియును కాదా సాయి

– సి.యస్.రాంబాబు

Related Posts