సాయి చరితము

సాయి చరితము

పల్లవి

దర్శనమీయవ సాయి
మనసును శుభ్రము చేయగ
దర్శనమీయవ సాయి
జీవిత పాఠము నేర్పగ
దర్శనమీయవ సాయి
ఈ జగతిని మార్చివేయగ

చరణం
కలలెన్నో కంటామయ్యా
అవి తీరక దుఃఖం కలిగితే
చిరునవ్వును కానుకచేసి
విజయాన్నే మాకుచూపి
ధైర్యాన్నే తోడుగ నిలిపి
బాటంతా మల్లెలు పరిచి
నిరాశల వెన్ను విరిచి
మము నడిపే గురువువు నీవు

చరణం
నీవైపే అడుగే వేస్తే
భయమంతా తొలగగ మేము
అభయాన్నే పొందుతాము
అనుకున్నది సాధించేందుకు
మావెంటే నీవు ఉంటావు
మా తనువు మనసు నీది
నీ నామము ప్రాణము మాకు
నిన్నే నమ్మిన మాకు
నీ చరితము మార్గము చూపు

– సి.యస్.రాంబాబు

Related Posts