సాయిచరితము

సాయిచరితము

పల్లవి
నీచూపేగా మాకు వేదము
నీరూపేగా ఎంతో అందము
నీ తలపేమో ఎంతో మధురము
నీవేనయ్యా మాకు దైవము

చరణం
నినుకొలిచినచో
భయమే ఉండదు
కష్టమునందున వెంటే ఉండి
వేదనతీర్చీ వేడుకచూపే
దత్తగురువువు నీవయ్యా
కాలము మాపై పగబడుతుంటే
నీ నామముతో గెలిచేమయ్య
సద్గురుసేవే కాపాడునుగా నిత్యము మమ్ము

చరణం
పేదా గొప్ప తేడాలొదిలి
మనిషిగ బతుకు అనిచెప్పితివి
కులము మతము భేదములొద్దని
బోధించితివి ఎన్నడో నీవు
నీపై నమ్మిక ఉంచిన చాలు
అదియే మాకు ఎంతో మేలు
దైవము ఒకడే మార్గాలెన్నో
బాటలు ఎన్నో గమ్యము ఒకటే

చరణం
సాయిని వేడితే సాధ్యము అన్నీ
ఆకలిదప్పులు అసలే ఉండవు
తన చరితమునే చదివితిమంటే
మనసుకు కలుగును ఎంతో హాయి
మమతల పందిరి వేయును సాయి
అందరి హృదిలో నిండెను సాయి
సాయి తత్వమే తెలిసిన నాడు
కోపము క్రౌర్యము వీడును చూడు

– సి.యస్.రాంబాబు

Related Posts