సాయిచరితము 

సాయిచరితము 

పల్లవి
బతుకే భారమయా
ధైర్యము నీయవయా
సాయము చేసేటి
సాయి ఒకడేలే

చరణం
బాధలు భయపెడితే
భయమే వెంటుంటే
సాయినే తలచితివా
అండ నీకు దొరుకునుగా
అంధకారముంటేను
ఆపద కలిగినచో
నీడగ తానేమో
ఉంటాడు చూడవయా

చరణం
తన భక్తుల కోసం
పగలు రేయిని మరచి
కాపాడుట కోసం
వెంటే ఉండునుగా
చింతే తీర్చునుగా
మీరంత పిల్లలనుచు
వెన్ను నిమురును తాను
నీ బాధ నాదనచు
ఆభయము ఇచ్చునుగా

– సి. యస్. రాంబాబు

Related Posts