సాయిచరితము

సాయిచరితము

పల్లవి
నీ పదములతో గడువగ బతుకు
నీ పాదములను చేరెను మనసు
నీ మార్గమునే నడుచుట తోటి
జీవితార్థమే తెలియును కాదా

చరణం
దానము దయలే మనిషికి ముఖ్యము
తెచ్చును ఎంతో అవి సఖ్యమును
ఈ సత్యమునే తెలిపినవాడవు
మా కన్నులనే తెరిచినవాడవు

చరణం
నీ దయతోటే సాగేమయ్యా
నీ కృపతోటే కదిలేమయ్యా
నినుగాంచినచో సమయము
తెలియదు
చిత్తము అంతా ఎంతో శాంతి

చరణం
నీ పలుకులనే తెలియని వారము
నిను కొలుచుటయే తెలిసినవారము
నీ తత్వమునే బోధించమని
నిత్యము నిన్నే వేడెదమయ్యా

చరణం
జీవనతత్వము తెలిపెడివాడు
తెగులే పట్టిన మనుషులకేమో
ప్రేమను చూపే సద్గురుసాయిని
విడువక ఎన్నడు సాగెదమండీ

– సి.యస్ .రాంబాబు

Related Posts