సాయిచరితము

సాయిచరితము

పల్లవి
దారే కనపడక
బాధను దాచితిమి
గురువే నీవనుచు
ప్రార్థన చేసితిమి… సాయి.. మా సాయి

చరణం
కాలము వెలుగులో కరుణే చూపెదవు
ధైర్యము నీవనుచు ముందుకు సాగెదము
నీ మూర్తి దాచుకుని నీ స్ఫూర్తి తీసుకొని నిలబడినామయ్యా
జీవితము నీదనుచు ఇంకేమి కోరమయా

చరణం
స్వార్థాన్ని విడలేని బతుకేమో మాదయ్యా
దయచూపి మమ్ములను మార్చగా రావయ్యా
నీ చరిత చదివినచో రాతేమో మారునయా
అందరొకటేనన్న భావనే నేర్పవయా

చరణం
సాయి అని తలచినచో మనసేమో ఉప్పొంగు
దరిచూపి దీవించి ప్రేమగా నవ్వుతావు
కల్లోల జీవితాన్ని సరిజేయు వాడవుగా
మావెంట నీవుంటే మదికేమో మురిపెముగా

చరణం
ఏ జీవికైనను ఆకలొకటేననుచు
అది తీర్చు మనిషంటే నాకేమో
ప్రేమనచు
నీ తత్వమును తెలిపి ధన్యులను చేశావు
మనిషిగ బతికేందుకు దారినే చూపావు

– సి. యస్. రాంబాబు

Related Posts