సాయిచరితము

సాయిచరితము

*పల్లవి*
నీ దివ్యరూపము
గాంచిన కనులది
ఎంతటి భాగ్యము
నీ దివ్యనామము
పలికే పెదవుల
దెంతటి పుణ్యము

*చరణం*
ఆకలిదప్పులు మరచిన మాకు
నీ తలపులతో నిండెను మేను
నేను,మేము భావన లేదు
నిను కీర్తిస్తూ గడిపెదమయ్యా

*చరణం*
నిను సేవించే సేవే చాలు
నీ దీవెనతో కాలము కదులు
ఎన్నడు మమ్ము వీడకు సాయి
కలలోనైనా మా తలపే నీవు

*చరణం*
జీవితమంటే భయమే వలదని
సకల జీవులను ప్రేమించమని
బోధనచేసి దారిని చూపి
భవసాగరమును దాటిస్తావు

*చరణం*
నీ కృపతోటి నడిచెదమయ్యా
లీలలు నీవి చదివిన చాలు
బెంగేలేదు భయమూ లేదు
బతుకే మారును దాహము తీరగ

– సి.యస్.రాంబాబు

Related Posts