సైనికుడి ఆవేదన

సైనికుడి ఆవేదన

సైనికుడి ఆవేదన

నా ఊరిని,నా వాళ్ళని ,అందరినీ
వదిలేసి మరి వచ్చాను ఇక్కడికి
దేశమంటే ప్రేమతో ,దేశానికి ఏదైనా
నా వంతు సాయం చేయాలని
దేశం నాకేమిచ్చింది అని కాకుండా
నేను దేశానికి ఎలా ఉపయోగపడాలి
అనే భావం తో నేను సైన్యం లో చేరాను
చిక్కటి రాత్రి లో , మంచు ముద్దలు కురుస్తున్నా
శత్రువులు ఎటు నుంచి పొంచి వస్తారో అని
కళ్ళు ముయకుండా, కంటిని మలప కుండా
నా ఈ దేశాన్ని నా తోటి వారందరితో కలిసి
రక్షిస్తున్నాను ఇది నాకెంతో ఆనందంగా ఉంది
నేను వచ్చేటప్పుడు నా తల్లి , గర్భవతి అయిన
నా భార్యా ఏడుస్తుంటే , ఇప్పుడే కాదు నేను
చనిపోయాక కూడా మీ కoట్లోంచి చుక్కనీరు కూడా
బయటకు రానివ్వకండి, అలా వస్తె నేను దేశాన్ని
కాపాడనట్టే అంటూ వారి కన్నీళ్లు తుడిచి, నా కన్నీటిని దాచి
మరి వచ్చాను నా దేశాన్ని కాపాడాలని ఇక్కడ ఏన్ని బాధలు
పడుతున్నా , సంతోషంగానే ఉన్నాం, నేను ఒక భాగం అయ్యాను

అనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను…. కానీ

ఇక్కడ మేము ఇంతగా కష్ట పడుతూ ఉంటే అక్కడ
మీరు చేసేది ఏమిటి , దేశాన్ని ఈ రకంగా కాకుండా
యువత ను మాయలో దింపి డ్రగ్స్ లో మునిగి తెలిస్తూ
పబ్బుల్లో అమ్మాయిలను చేరుస్తూ,

నీతి నిజాయితీ న్యాయం ధర్మం మరచి , ప్రాజెక్టుల పేరిట

నా దేశాన్ని దోచుకుంటున్నారు మరో రకం దొంగలు. ప్రతి రోజూ
అక్కడ జరుగుతున్న ఘోరాలు అన్ని వింటుంటే అయ్యో
నా దేశం ఏమై పోతుంది ఏటూ పోతుంది అనే ఆవేదన
నన్ను చంపేస్తుంది.

మానవత్వం మంట కలిపి నిత్యం భారత మాతకు ముద్దు
బిడ్డలుగా ఉన్న చిన్నారులను చిధిమెస్తూ ఉంటే ఇందుకేనా
నేను దేశాన్ని రక్షిస్తున్నా అని నా గుండె వెయ్యి ముక్కలు అవుతుంది.

నిమిషానికో మానభంగం, గంటకో హత్య ,

రోజుల్లో నల్లధనం చేతులు మారడం చూస్తూ,

ప్రభుత్వ భూములు, ఆస్తులన్నీ ప్రైవేటు పరం అవడం చూస్తుంటే

నా మనసు ముక్కలు అవుతుంది.

ఇదేనా నేను కోరుకున్న భారత దేశం అని మనసు మూగగా రోదిస్తున్నది.

సస్యశ్యామలంమైన నా ప్రశాంత భారత దేశం
నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం కలిగిన నా దేశం
ఇప్పుడు మురిగిన, ముసిరిన ఈగలతో మురికి కాలువ లా
మారిపోయిందే అని నా మనసు ఘోషిస్తుంది. ఇంకెలా
మార్చాలి నేను నా దేశాన్ని , దేశం కోసం

ప్రాణాలు సైతం పోతాయని తెలిసినా

ఇక్కడ పహారా కాస్తూ, నా ఇంటి వారికి
ఏ రోజు ఏ కీడు జరుగుతుందో అని భయపడుతూ ఉన్నా
నా కుటుంబం అంతా దేశానికి ప్రాణాలు ఇవ్వడం నాకు ఇష్టం
కానీ నాకు పుట్టబోయే బిడ్డకు రక్షణ ఉందా, నా భార్యా ,తల్లి కి రక్షణ ఉందా

అనే ఆలోచనతో నిత్యం సతమతం అవుతూ
మౌనంగా రోదిస్తూ, మాటలు రాక మౌనమై పోయింది

నా మూగ గొంతును తెరిచి గట్టిగా అరవాలని ఉంది ….

ఓ నా దేశామా నాకేమిచ్చావు అంటూ అడగాలని ఉంది….

ఇన్నాళ్లు దేశానికి నేనేమిచ్చాను అనుకున్నా ..

కానీ ఇప్పుడు రాబందుల రాజ్యం లో చిక్కుకున్న

నా దేశాన్ని ఎలా విడిపించు కోవాలో తెలియని స్థితిలో ఉన్నా….

అదిగో శత్రువుల అలికిడి వినిపిస్తుంది..నేను వెళ్తున్నా ..

మళ్లీ వస్తానో రానో కానీ ఓ నా దేశమా ..

ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆశిస్తున్నా…..

 

 

-భవ్య చారు

 

జై జవాన్ Previous post జై జవాన్
నువ్వు కళ్ళు తెరువొద్దు Next post నువ్వు కళ్ళు తెరువొద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close