సైనికుడు ధీరజ్

సైనికుడు ధీరజ్

సైనికుడు ధీరజ్

అమ్మ అందరికీ అన్నం పెట్టుతుంది.నాన్న తన భుజాల మీద పిల్లల్ని ఎక్కించుకొని ప్రపంచం మొత్తం చూపిస్తాడు.

అలాగే మన దేశ సైనికులు మన ప్రాణాలకు రక్షణగా నిలిచి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళు చేసిన త్యాగనిరతి గుర్తు చేసుకుంటూ ఉండాలి.అలాంటి సైనిక కుటుంబాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు.

ధీరజ్ కి మిలిటరీలో జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ వచ్చింది. తను ఎంతో సంతోషంతో తన కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నాడు.

తను రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాడు ,అంటే కుటుంబ సభ్యులందరూ బాధపడ్డారు. కానీ తను ఏరి కోరి ఎంచుకున్న ఉద్యోగం మరి , ఆ ఉద్యోగం రావడమే గొప్ప. ఇంకా వాడి ఆనందం ముందు మన బాధ ఎంత అని అనుకున్నారు. కుటుంబ సభ్యులు.

ధీరజ్ కి ఇద్దరు చెల్లెలు. ఒక చెల్లికి పెళ్లయింది. ఇంకో చెల్లి చదువుకుంటుంది. అమ్మ నాన్న ఉన్నారు. ఒక ఇల్లు , ఎకరం పొలం ఉంది.

శుభకార్యాలకు పండగలకు అప్పుడప్పుడు వచ్చేది శిరీష.ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు.ఆరు నెలలకి సంవత్సరానికి ఇంటికి వస్తూ ఉండేవాడు ధీరజ్.

ఒక నెల రోజులు నుండి ఫోన్ చేయడం లేదు ధీరజ్.దాంతో కుటుంబ సభ్యులు కంగారు పడి విషయం ఏంటో కనుక్కోడానికి ప్రయత్నించారు.

ధీరజ్ ఉన్న చోట గొడవలు జరుగుతున్నాయి, కాబట్టి ఫోన్ చేయడం లేదని అనుకున్నారు కుటుంబ సభ్యులు.
అలా ధీరజ్ వెళ్లి రెండు సంవత్సరాలు గడిచిపోతున్నా, తర్వాత ఇంటికి వస్తాడు అని ఎదురు చూస్తున్నా కుటుంబ సభ్యులకి ఒక వార్త వాళ్ళని కోలుకోలేకుండా చేసింది.

ఆ వార్త విని వాళ్ళ నాన్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది.ధీరజ్ చెల్లెలు స్వప్న వాళ్ళిద్దరిని చూసుకుంటూ ధీరజ్ ఇంకా లేడు, రాడు అని జీర్ణించుకోలేకపోయింది.

వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తే కాసేపు చావుతో పోరాడి, వాళ్ళ నాన్న చనిపోయాడు. ధీరజ్ వాళ్ళ అమ్మకి చాలా సీరియస్ గా ఉంది.

ధీరజ్ వాళ్ళ నాన్న అంత్యక్రియలు పూర్తయిన తర్వాత, ధీరజ్ వాళ్ళ అమ్మ కొద్ది, కొద్దిగా కోరుకుంటూ,స్వప్న ఒక చిన్న జాబ్ చూసుకుని ఇటు అమ్మని, అటు జాబ్ ని మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది స్వప్న.

స్వప్న వాళ్ళ అమ్మ స్వప్న కి పెళ్లి చేయాలనుకున్న తాను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసింది.ఇలా వాళ్ళ కుటుంబం అతలాకుతలం అయిపోయింది.

ఎప్పుడూ నలుగురు కలిసి ఉండే కుటుంబంలో ఇద్దరు పెద్దవాళ్లు వెళ్లిపోయారు. ఆడవాళ్ళే మిగిలిపోయారు.
సైనికుడు ధీరజ్ గా తన ప్రాణాలు దేశానికి అర్పించి తన కుటుంబాన్ని దూరం అయ్యాడు.

 

 

-మాధవి కాళ్ల

 

న్యాయమా Previous post న్యాయమా
కదం తొక్కిన యువగళాలు Next post కదం తొక్కిన యువగళాలు పుస్తక సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close