సఖి

సఖి

చెలీ నీలో నన్ను కలుపుకుని
నాలోని స్నేహ మాధుర్యాన్ని నింపి
నీతో ఉన్న సమయాన్ని అంతా
గుర్తుగా దాచుకునేలా చేసి
ఎన్నో అనుభూతులు నింపి
నాతో సాగుమా నేస్తమా అంటూ
నాలో అలజడి రేపుతూ ఎన్నో
జ్ఞాపకాల దారుల్లో నిన్ను ఇప్పటికీ
ఎప్పటికీ తలుచుకునేలా చేసి
కాస్త సమయం చిక్కగానే
కనుమరుగై పోయావే …
ఏటు పోతివే నా సఖీ…

– అర్చన

Related Posts