సమాధి

సమాధి

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
ఈ భువి లో నీకు ఆ కాస్త చోటు దొరక లేదా
చిన్ని పాదాలను కొలిమి లో కాలుస్తావు 
నీ చిట్టి చేతులతో బీడీలు చూడతావు
నీ లేత భుజాల పై మట్టి తట్టలు మోస్తావు
నీ తల పై ఈ భూభారాన్ని అంతా మోస్తున్నట్టు
తట్టలు తట్టలు మట్టిని మోస్తూ ఆ అందమయిన
ప్రాకారాల లో నీ పయనం మొదలుపెడతావు
అందమైన బాల్యాన్ని అలా సమాధి చేస్తావు.

– భవ్యచారు

Related Posts