సమాజం గుర్తించని మనిషి
నేను ఎప్పటికి సమాజంలో బ్రతకలేదు
కానీ అక్కడ సమాజంతో బ్రతకడానికి
నేను ఎంతో ప్రయత్నం చేశాను..
కానీ నా జీవితంలో కొన్ని పరిస్ధితుల కారణంగా
సమాజం అనే ఒక ప్రపంచం ఉంది అని
నేను తెలుసుకున్నా…
అందరిలా నేను కూడా ఒక ప్రపంచాన్ని ఏర్పాటు
చేసుకోవాలని అనుకున్నా
నేను సమాజాన్ని అర్దం చేసుకొని బ్రతకలేకపోయను..
ఇలా ఒంటరిగా మిగిలిపోయాను…
సమాజం యొక్క విధి దాని అంతర్లీన ముగింపు, ఉమ్మడి మంచి, అంటే, దాని సభ్యులందరికీ పూర్తిగా మానవ ఉనికిని సాధ్యం చేసే పరిస్థితులు..
మనిషి యొక్క స్వేచ్ఛా ఎంపికకు తెరిచిన సాధారణ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయి..
నేను సమాజం గుర్తించని మనిషిగా మిగిపోతున్నాను
ఎంత పేరు , ప్రఖ్యాతులు పొందిన ఆ మనిషి మరణంతో అన్ని మర్చిపోతారు..
మంచి వాళ్ళు అయితే వాళ్ళ పేరు శాశ్వతంగా మర్చిపోలేరు..
మనం చేసే పనులు బట్టి సమాజంలో ఒక పేరు , ప్రఖ్యాతులు వస్తాయి…
అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు..
వాళ్లే నాకు స్ఫూర్తి …
- మాధవి కాళ్ల