సమాజంలో నేటి మహిళ

సమాజంలో నేటి మహిళ

ఆదిపరాశక్తిగా పూజిస్తారు
అమ్మ అంటూ ఆరాధిస్తారు
అక్క చెల్లి అంటూ ప్రాణం ఇస్తారు
ప్రియురాలు భార్య అంటూ ప్రేమిస్తారు.
స్నేహితురాలు అంటూ చేయూతనిస్తారు..

కేవలం ఇవన్నీ మాటల్లోనే…

అదే సమాజంలో అనుమానంతో శంకిస్తారు
అభల అంటూ అవమానిస్తారు

ఆడది అంటే అలుసైపోయింది
కుమార్తె అంటే భారమైపోయింది
భార్య అంటే బానిస అయిపోయింది

ఇట్టి సమాజాన స్త్రీలకు అండ ఎవరు..
స్త్రీల రక్షణకు దిక్కెవరు
స్త్రీలను కాపాడు వారెవరు..

సావిత్రిబాయి పూలేలు లేరా
తారాబాయి షిండే లు రారా
పండిత రమాబాయి లా కారా..
ఝాన్సీ లక్ష్మి లా దూకి దూకరా..

వాళ్లవన్నీ కథలేనా..
ఇక మనకు మిగిలేది వెతలేనా.
ఇలా ఉంటే సమాజం మారేనా..
మహిళాలోకం బాధలు తీరేనా…

ఎవరో ఏదో చేస్తారు అనేది మానేద్దాం..
ఇతరుల కోసం ఎదురు చూడటం ఆపేద్దాం..
మహిళాభివృద్ధికి అండగా నిలుద్దాం..

ఆదికి మూలం ఆడది
ప్రేమానురాగాలకు పెన్నిధి
భవ బంధాలకు వారధి..
వసుదైక కుటుంబాల సారధి..
భరతమాత గా పేరున్నది..

మహిళలపై జరిగే దాడులను అడ్డుకుందాం..
మనవాళ్లను మనమే కాపాడుకుందాం
మహిళల రక్షణ మన ఇంటి నుంచే ప్రారంభించుకుందాం.
మహిళలపై సమానత్వ భావనను చాటుకుందాం..
మన దేశ గౌరవాన్ని నిలుపుకుందాం..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts