సమాధానం

సమాధానం

సమాధానం

కనిపించని మనసు
కనిపించే శరీరాన్నెంత
ప్రభావితం చేస్తుంది
ఏ వ్యాధొచ్చినా
మనసు గట్టిదైతే
మందు మరింత పనిచేస్తుంది

మనసును దృఢంగా ఉంచగలవా నువ్వు
గాయపరిచే మాటలు
బాధపెట్టే ఘటనలకు
మందేముంటుది
మనసు రాయిగా మారటం తప్ప

తప్పదు…మనసును బుజ్జగించి
ఉత్సాహపరచాల్సిందే
అందుకో మిత్రుడి ఆప్తవచనం తోడు కావాలి
ఆ మిత్రుడు నీకున్నాడా అని
మనసు వేసే ప్రశ్నకు
సమాధానం దొరక్క సమాధయిపోతున్నాను

 

-సి.యస్.రాంబాబు

శత్రు స్నేహితుడు Previous post శత్రు స్నేహితుడు
వాలుజడ Next post వాలుజడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close