సమాజం లో జరిగే అన్యాయాలు

సమాజం లో జరిగే అన్యాయాలు

సమాజం లో జరిగే అన్యాయాలు

ఓ బోలెడు ఉన్నాయి జరిగేవి. మూడు రూపాయల కు వచ్చే సబ్బుని మూడు వేలకు అమ్మే దగ్గరి నుండి నాలుగు రూపాయలకు వచ్చే పెన్ను ను నాలుగు వేలకు అమ్మడం. ఇవన్నీ కాక కారం పొడి లో ఇటుకల పొడి, చపత్త లో చింతగింజల పొడి , నెయ్యి లో పామాయిల్ కలపడం దగ్గరి నుండి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి,
1. ప్రజలను నాయకులు మోసం చేస్తారు . మీకు అన్ని పథకాలు ఇస్తామంటూ మభ్య పెడతారు.
2. మార్కెటింగ్ లో తక్కువ రేటు కే భూమి ఇస్తామంటూ మోసం చేయడాలు
3. అవసరానికి వాడుకుని అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు
4. అబ్బాయిలను వాడుకుని వదిలేసే అమ్మాయిలు
5. భార్యని మోసం చేసే భర్తలు
6. భర్తను మోసం చేసే భార్యలు
7. తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు
8. పిల్లలకు డబ్బులిచ్చి తమ రహస్యాలు దాచేవారు
9. డ్రగ్స్ అమ్ముతామని చక్కర పొట్లాలు అమ్మేవారు
10. కరక్కాయ బిజినెస్ అంటూ ఆడవారిని నమ్మించి మోసం చేసేవారు .
11. పప్పుల చిట్టి అంటూ పెట్టీ అన్యాయం చేసి రాత్రికి రాత్రే బిచనా ఎత్తేసేవారు.
12. కాలేజీకి వెళ్తున్నాం అని ఓయూ రూమ్ లో దూరి తల్లిదండ్రులను అన్యాయం చేసేవారు.
13. కూరగాయలు రెట్ తక్కువ కు తెచ్చి యజమానికి ఎక్కువ రెట్ చెప్పేవారు.
14. టెండర్ లు తక్కువ వేసి ఎక్కువ కు అమ్ముకునేవారు
15. కాలేజీలో సీట్లు లేవంటూ రహస్యంగా అమ్ముకునే వారు
16. అనాథల పేరు చెప్పి డొనేషన్లు కలెక్ట్ చేసేవారు
17. హాస్టల్ లో పిల్లలకు పురుగుల అన్నం పెట్టేవారు
18. నాసిరకం మందులు అమ్మేవారు
19. కల్తీ మందులు అమ్మి రైతులను అన్యాయం చేసేవారు
20. గిట్టుబాటు ధర ఇవ్వక అదే రైతును మోసం చేసే అధికారులు
21. పంట కొనమంటూ బెదిరించే దళారులు…
ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే అవుతుంది తప్ప చిన్నది అవదు. అడుగడుగునా సమాజం లో అన్యాయాలు తప్ప  న్యాయం, మంచనేది మచ్చుకు అయినా కనిపిస్తే ఒట్టు. బూతద్దం పెట్టుకుని మరీ చూసినా ఒక్కటైనా న్యాయం జరిగినట్టు కనిపించలేదు. అంతెందుకు నిన్న ప్రమాదం లో చనిపోయిన వారికి భీమా డబ్బులు ఇస్తారా ? ఇచ్చే సమయం లో ఎంతమంది ఎంత నొక్కేస్తారో ఎవరికెరుక .. నిత్య నూతనం సమాజ అన్యాయం…

– భవ్య చారు

ఇష్టమైన కవులు Previous post ఇష్టమైన కవులు
మా నాన్నే నా హీరో Next post మా నాన్నే నా హీరో

One thought on “సమాజం లో జరిగే అన్యాయాలు

  1. సమాజంలో మోసపోకుండా ఉండాలంటే ఈ వివరాలు తప్పక చదవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *