సమాజపు పయనం

సమాజపు పయనం

సమాజపు పయనం

 

దేవుళ్ళు పాలించిన రాజ్యాలు ముగిసిపోయిన తర్వాత అక్కడక్కడ ఉన్న ప్రజలకు కొందరికి ఆసరా కావాల్సి వచ్చింది. తమకు అండగా ఎవరో ఒకరు ఉండాలి అనే ఆలోచన కలిగింది. దాంతో ప్రజలందరూ కలిసి తమలో అందరికన్నా వయసులో పెద్దవాడు అన్ని అనుభవం కలిగిన అతన్ని తమ కుల పెద్దగాను లేదా తమ అందరికీ పెద్దగానో ప్రకటించుకున్నారు.

ఆ తర్వాత రాజ్యాలు మొదలయ్యాయి రాజులు ఎదుగుతూ పన్ను పేరిట శిస్తు వసూలు చేస్తూ తమ ప్రజలను తామే పాలిస్తూ వారికి అన్ని విధాల అండగా ఉంటూ కాపాడుతూ వచ్చారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాజుతో చెప్పుకునే విధంగా రాజు ఆ కష్టాన్ని తీర్చేలా ఏర్పాటు చేశారు.

దాంతో ప్రజలందరూ తమ రాజుకు విధేయతలతో గౌరవిస్తూ చూసుకుంటూ ఉండేవారు. రాజు ఏది రాజు ఏది చెప్పినా ప్రజలు దాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్లు. ఆ తర్వాత  తర్వాత కొందరు స్వార్థపు రాజుల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న క్షణంలో మరోకరు ఎవరో ఒకరు రాజుని ఎదిరించి వారి స్థానంలో ఉండడం ప్రారంభమైంది. ఇక్కడి నుంచే సమాజం పయనం అనేది మొదలైంది.

తమకు అన్ని విధాల అండగా ఉంటూ తమను కంటికి రెప్పలా కాపాడే వారిని న్యాయం మాట్లాడే వారిని న్యాయం చేసే వారిని ఏ ఆపద వచ్చినా క్షణంలో తీర్చే వారిని ప్రజలు బాగా నమ్మడం మొదలుపెట్టారు. దాంతో ప్రజల ఆలోచన మొదలైంది. తమకు ఎవరైతే మంచిగా ఉంటారు. వారినే మనం రాజుగా ప్రకటించుకోవాలి అని నిర్ణయించుకున్నారు.
దాంతోపాటే ఆర్థికంగా, సర్వ స్వతంత్రంగా ,బ్రతికే స్వేచ్చని కూడా వారు కోరుకున్నారు .కాబట్టి రాజుల నిర్బంధ రక్షణ తొలగించాలని అనుకుంటూ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలిగే హక్కు. స్వేచ్ఛగా ఉండాలని కోరుకోవడం వల్ల ప్రజల్లో మార్పు రావడం దాంతో పాటే నాయకులం అంటూ తయారవడం మొదలైంది.

ప్రజలు తమకు స్వేచ్ఛని ఇచ్చే వారిని. తమను నిర్బంధించని వారిని. తమకు అన్ని విధాల అనుకూలంగా ఉండే వారిని. తామే నిర్ణయించుకునేలా ఓట్లు అనే హక్కు ద్వారా తమ నాయకుడిని ఎన్నుకోవాలి అని అనుకోవడం సమాజ మార్పుకు దోహదపడ్డాయి. ఆ కారణంగానే ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోటీ అనేది మొదలైంది. ఇది మల్ల యుద్ధం నుంచి నేటి ప్రజల ఓటు అనే ఆట వరకు కొనసాగుతుంది.

విద్య ,ఉద్యోగం ,ఆరోగ్యం ,ఆహారం , రక్షణ, వైద్యం అనే ఈ ఆరు అంశాలు ఎవరైతే బాగా నిర్వహిస్తారో ఎవరికైతే ఎక్కువ అనుభవం ఉంటుందో వారిని తమ నాయకుడిగా ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు. అలా అలా కాలక్రమేనా ఇప్పుడు  ఇద్దరూ ముగ్గురు ప్రత్యర్థులు పెరగడం మొదలైంది.

ప్రత్యర్థులు పెరగడంతో ప్రజలు కూడా మూడు వర్గాలుగా విడిపోయి తమ నాయకుడు మంచివాడు అంటే తమ నాయకుడు మంచివాడు అంటూ పోట్లాడుకోవడం మొదలై అది తమలో తామే చంపుకునేంతవరకు వెళ్ళింది.

అంటే మళ్లీ పూర్వకాలం మొదలైంది అని అర్థం. దేవుళ్ళ కాలంలో కూడా ఇలాగే యుద్ధాలు చేసి, జూదాలలో ఓడించి ,ఒకరి రాజ్యం కోసం ఇంకొకరు పోట్లాడుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్లీ అలాగే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ దేవుళ్ళు అంతర్ధానమయ్యారు. మనుషులు మాత్రం తమలో తాము కొట్లాడుకుంటూ. ఒకరినొకరు చంపుకుంటూ రాజ్యాధికారం కోసం వర్గాలుగా విడిపోయి పోట్లాడుకుoటున్నారు.

అంటే సమాజం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఏ దేవుళ్ళు అయితే మొదలుపెట్టారో మళ్లీ అక్కడికే వచ్చి ఆగిపోయింది. అందరికీ కావాల్సిన కనీస అవసరాలు ఒకటి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వైద్యం, ఆహారం, రక్షణ, అనేవి ఉచితంగా కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు.

ఈ కనీస అవసరాలు కూడా తీర్చలేని నాయకులు తమకు వద్దు అంటూ ప్రజలు సర్వ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఇప్పుడు అందరికీ ఉంది. కాబట్టి తమ నాయకుడిని తామే ఎంచుకుంటున్నారు.

తమను నిర్బంధించే వారిని, తమని కట్టుబాట్లలో ఉంచే వారిని, అన్ని విషయాల్లో అణచివేసే వారిని ప్రజలు కోరుకోవడం లేదు. అనేది ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఒకప్పుడు ఉన్న ఈ నిర్బంధం అనేదాన్ని ప్రజలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే ఎంతటి పని చేయడానికి అయినా వెనుకాడడం లేదు. ఈ సమాజం ఎక్కడినుంచి వచ్చిందో మళ్లీ అక్కడే ఆగిపోయింది.

 

– భవ్య చారు

వాలుజడతోలుబెల్టు Previous post వాలు జడ తోలు బెల్టు
అమ్మోఇల్లు Next post అమ్మో ఇల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close