సమన్వయమై సాగుతున్న

సమన్వయమై సాగుతున్న!!!

సమన్వయమై సాగుతున్న!!!

అణువణువున ఆకృతులకు నిలయమే…
పరమాణువంతటిది కూడా పదార్థమే
కావాలనుకొన్నది కోరని ప్రయాణమై
నిలబడని అచేతనం చైతన్యమై…తలచిన
కాలాన్ని వన సంస్కృతికి వారసత్వంగా
పూయిస్తు…ధరికిరాని వసంతాలను
కోయిల గొంతున రాగమై పిలిపిస్తున్నాను
యుగాంతరాలు నడువాలని….

ఆశాజనితాలకు మనుషులు ఊరట…
నేను రూపం కాదు తానొక నిశ్చలత కలిగిన
ఏకాంత సాధనలోని పరమాత్మ తత్త్వాన్నని…
భోధపడని శూన్యత్వంలో నా హృదయ
స్పందనని వినలేవు…నిష్టూరాల వెల్లువతో
నిమగ్నతను ముంచేస్తు…తేలని నిజాలతో
ఆకారాలుగా తెల్లబోయి జీవచ్ఛవాల మధ్యన
గబ్బిలంగా వేలాడుతున్నావు….

తాను అవనినైనా నేత చీరలు కోరను…
సామ్రాజ్యాధికారాల తెంపును చిత్రపఠంగా
బహుమాన మడుగను ధర్మం వెలితైనదని
కడువలతో దుఃఖాన్ని శోకంగా ఒలకబోయను
చీకటి పొరలతో నిండిన భూగర్భదామమై…
దాచినవన్నీ పండిస్తు పగిలిన
మృతఖండాలను దాచేస్తు కదిలే కాలచక్రంగా
నిరాకార బంధాలతో నిన్నటిని అడుగకా
రేపటిని ఆపకా…సమన్వయమై సాగుతున్న
నిష్పక్షపాత పయనం నాది…

కదిలే కర్మయోగి మానవుడు…
మర్మాన్ని మరిచి నిరంతర దర్పణపు
భ్రమణాలతో యోగ్యతకాని అనిర్వచనీయపు
సందిద్దులచేత కాలానికి దోషుడై…
నీ ఉపద్రవాలకు దాసుడవై…కమనీయం కాని
కఠోరాల పొద్దులతో సగభాగాన్ని వ్యామోహాల
వాంచలకు గుచ్చుతు…మోపిన అడుగు
రాక్షసపు మడుగులతో ఎందరినో బలిగొంటు
ప్రాపంచీకపు దురాక్రమణలను దప్పికగా
తాగుతున్నావు…

 

-దేరంగుల భైరవ

బంగారు తల్లులు Previous post బంగారు తల్లులు
కాలంకలిసొస్తే Next post కాలం కలిసొస్తే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close