సందడి

సందడి

వేకువజామున కోవెలగంటను నేనై
నీ గుండెగూటిలో సందడి చేయాలని ఆశ

తొలిపొద్దు వేళ నులివెచ్చని రవికిరణం నేనై
నీ చెక్కిలిపై శృతి చేయాలని ఆశ

నిండు పున్నమి వేళ పండువెన్నెల నేనై
ప్రణయరాగాలు పలికించాలని ఆశ

ఆశ తీరేనా అవధులు లేని ఆనందం సొంతమయ్యేనా

– మల్లి ఎస్ చౌదరి 

Related Posts