సందేహాల మబ్బు

సందేహాల మబ్బు

తమ తేజస్సు పంచుతామంటున్నాయి మేఘాలు
మనిషి మేకవన్నె పులని తెలీక!
తేనీరులా వనరులను సేవించే వాడికి
ఆకాశమొక్కటే మిగిలింది
మొక్కుతూనే మోసాల దారులు వెతుకుతుంటాడు!

వేటువేసే కాలం ఉపేక్షిస్తుందా
ఆపేక్షగా ఆదరిస్తుందా
సందేహాల మబ్బులు తరుముతుంటే
కిసుక్కుమంటూ సమాధానాన్ని
తలలో తురుముకుంది ఎదురుగా ఉన్న చెట్టు!

– సి. యస్. రాంబాబు

Related Posts