సంఘజీవి

సంఘజీవి

నా ఇష్టం నేను నా లాగానే ఉంటాను. ఎవర్నీ పట్టించుకోను నాకు నచ్చినట్టు చేస్తాను. నేను చేసిందే కరెక్ట్, నాకన్నా తోపు ఎవరు లేరు నేనే అన్ని… నాకు తెలిసిందే న్యాయం, నేను చెప్పిందే వేదం అంటూ కొందరు తెగ వాగుతూ ఉంటారు.

ఈ మధ్య ఇది ఇంకా చాలా ఎక్కువ అయ్యింది. సోషల్ మీడియాలో కొందరు ఇలాగే ప్రవర్తిస్తూ తమ మాటలతో, చేతలతో జనాలను పిచ్చి ఎక్కిస్తున్నారు. తాము చేసిన చేస్తున్న పని అందరికీ చూపిస్తూ, అశ్లీల వీడియోలు జనాల పైకి వదులుతున్నారు.

అయితే వీళ్ళు ఇలా చేయడానికి కారణం ఏమిటి వాళ్లకు వాళ్లు సెలబ్రిటీలు అని ఫీల్ అవ్వడమే అంటాను నేను. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా చేయరు. కానీ మధ్యలో వచ్చిన పేరు వల్ల వీళ్ళు ఇలా తయారు అయ్యారు.

టిక్ టాక్ వల్ల ఫేమస్ అయిన కొందరు తమ ఫ్యాన్స్ ను ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి వారి ద్వారా డబ్బులు సంపాదించాలని ఇలా పిచ్చి, పిచ్చి వీడియో లు చేస్తూ అందరిలో చులకన అవుతున్నారు. తామేం చేసినా తమ ఫ్యాన్స్ చూస్తారని వారి అతి నమ్మకం.

అయితే టిక్ టాక్ ఉన్నప్పుడు దాని మోజు లో పడి కొందర్ని కొందరు అభిమానించారు. ఫాలో అయ్యారు. ఇక కరోనా వల్ల ఇంట్లో ఉన్న సమయం లో పొద్దుపోక ఇవ్వన్నీ చూస్తున్న జనాలు కాస్త రిలీఫ్ అయినామాట నిజం. వారిని ఎంకరేజ్ చేసిన మాట నిజం.

కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు. ఒకేలా కాలం ఉండదు. కరోనా వల్ల బాధలు పడుతూ, కొంచం కొంచంగా తేరుకున్న జనాలు, వీరి అతి చేష్టలు చూస్తూ తట్టుకోలేక పోయారు.

వారిని దూరం చేయడం దూరం పెట్టడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయినా ప్రేక్షకుల ఆదరణ లేకపోతే మూలకు కూర్చోవాల్సిందే కదా, ఇక ఇలాంటి వాళ్ళు ఒక లెక్క లోకే రారు.

ఇవ్వన్నీ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇక మనం మన మెయిన్ పాయింట్ లోకి వద్దాం.

మానవుడు సంఘజీవి, తన చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేయక పోయినా, తన లిమిట్ లో తాను ఉంటూ, సమాజాన్ని బ్రష్టు పట్టించుకుండా ఉంటే అదే పదివేలు.

నాకు నచ్చిందే చేస్తాను. బట్టలిప్పి తిరుగుతాను, పిచ్చి డ్యాన్స్ లు చేస్తాను, అశ్లీల కంటెంట్ చేస్తాను. మనుషులను తప్పు దారి పట్టిస్తాను అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు.

అలా చూస్తూ ఊరుకోకుండా మంచిగా చేయండి అని చెప్పిన వారిని వీరు బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ తమ పబ్బం గడుపుతూ ఉంటారు.

మా ఇష్టం, మా ఛానెల్ లో మేము ఇలాగే చేస్తాము అంటే చూస్తున్న జనాలకు వారు చేస్తున్నది వెగటు కలిగించి, బయట కనిపిస్తే రాళ్ళు పెట్టి కొట్టే ఛాన్స్ లు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే బాగుంటుంది.

ఈ మధ్య మగవారి కన్నా, ఆడవారే ఇలాంటివి చాలా చేస్తున్నారు. మగాళ్లు అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఆడవారు కూడా ఇలా చేస్తుంటే అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

వారికి వారి పిల్లలకు చెడ్డపేరు వస్తుంది. సమాజం వారిని వెలివేస్తుంది. ఒకవేళ పెళ్లి అయ్యే వాళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు కావు. సమాజం వారిని భరితెంగించిన వాళ్ళ లాగా చూస్తుంది.

సమాజంలో ఇలాంటి చెడ్డ పేరు తెచ్చుకున్న తర్వాత ఇంకా ఆ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇది గ్రహించి వాళ్ళు మంచిగా మారితే వారి జీవితాలు బాగుపడతాయి. లేదంటే తెగిన గాలి పటం లాగా మారతాయి.

వారి వెనక ఉన్న వారు ఎప్పటికీ ఉండక పోవచ్చు. తర్వాత తమ బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. ఆలోచన లేకపోతే పెద్దలు చెప్పినప్పుడు అయినా విని తమ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు మారాలి. నూరేళ్ళ తమ బిడ్డల భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడాలి.

ఒకసారి సమాజంలో చెడ్డ పేరు వస్తె అది తరతరాలకు చెంప పెట్టులా మారుతుంది. అది గ్రహించి ఇప్పటి పాబ్బం గడిస్తే చాలు అనుకోకుండా భవిషత్తు తరాల కోసం పాటు పడాలి.

ఇకపోతే వీళ్ళు అనే కాకుండా సంఘంలో బ్రతికే ప్రతి మనిషి సమాజానికి సంఘానికి లోబడే ఉండాలి. సంఘాన్ని, సమాజాన్ని, సంప్రదాయాన్ని, ఆచారాన్ని కాదని ఎలాంటి పనులు చేసినా సంఘం వెలివెస్తుంది. నీకు ఎలాంటి సహాయం కావాలన్న కూడా ఎవరు ముందుకు రారు.

నీ ఇంటి వరకు నువ్వు రాజు, మంత్రి కావచ్చు, నీ కుటుంబానికి నువ్వే అన్ని కావచ్చు, నీ ఇంట్లో, నీ నాలుగు గోడల మధ్య నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, తాగొచ్చు, తినొచ్చు, బట్టలిప్పి ఆడొచ్చు, కానీ సంఘం, సమాజం లో నువ్వు ఒక భాగం మాత్రమే నువ్వే సంఘం కాదు.

నీకు నువ్వే తోపు కాదు. అది గుర్తెరిగి నువ్వు బాధ్యతగా నడుచుకుంటేనే నీ పిల్లలకు నువ్వు ఒక బాధ్యత కలిగిన పౌరుడిలా కనిపిస్తావు. వాళ్ళు నిన్ను చూసి గర్వపడతారు. ఇది గ్రహించి మెలిగితే అందరికీ ఆనందం, సంతోషం, సమాజానికి నువ్వొక దిక్సూచి.

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress