సంఘజీవి 

సంఘజీవి 

అందనిద్రాక్ష పండు పుల్లన 
మెరిసే సమాజం అబద్దం
అన్నట్టు వుంది  
కులమతాల కుట్రలో
కుళ్ళినపండులాగా తయారయ్యింది సమాజం. 
సతమతమయ్యే సమస్యలతో పరిమితులు
ఎన్నో పరచుకున్న  
ఆచరణలో సాధ్యం కాని
పనులతో
వ్యత్యాసాలను వ్యతిరేకిస్తూ
ఎదగాలని ఆశపడుతూ 
పట్టువదలని విక్రమార్కుడు లా
పట్టుకొని వ్రేలాడుతూ
వదలని విజ్ఞానంతో 
తొలగని అజ్ఞానంతో 
అవసరం వున్నా లేకున్నా
బ్రతుకు పోరాటం చేయాలి
నేటి సమాజంలో సంఘజీవిగా!
– జి.జయ

Related Posts