సంఘర్షణ పార్ట్ 3

సంఘర్షణ పార్ట్ 3

సంఘర్షణ మొదటి రెండు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి. అప్పుడే మీకు మొత్తం అర్థం అవుతుంది.

అవసరాలు తీర్చడం కోసం అప్పులు చేయడం సహజం, కానీ ఆ అప్పులు తీర్చే మార్గం ఉంటేనే అప్పులు చేయాలి, ఆ అప్పు భారం కాకూడదు. పస్తులు ఉండి అయినా అప్పులేకుండ చూడాలి.

కానీ పంట పండించే రైతు రేపనే ఆశ తో అప్పులు చేసి కట్టలేక అవమానాల పాలు అవుతూ, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వాలు చేతులు కట్టుకుని చిద్యలు చూస్తున్నాయి. అప్పులు తీర్చడం కోసం కన్న బిడ్డలను అమ్ముకున్న వారు ఉన్నారు..

********

అబ్బబ్బ ఏం ఊరిస్తున్నావే తొందరగా చెప్పి తగలడు అంది విసుగ్గా కరుణ.

నువ్వు ఇలా చిరాగ్గా మాట్లాడావనుకో నేను అప్పుడే చెప్పను అప్పుడు నీకు ఏ దారి ఉండదు.

నువ్వు నాకు సేవ చేసుకో అప్పుడే నేను చెప్తాను అంది పోజు కొడుతూ సుప్రజ.

నీ సోది అస్సలే సేవ ఏం చేయను ఇష్టముంటే చెప్పు లేకపోతే లేదు.

నేను డైరెక్ట్ గా ఇప్పుడే వెళ్లి మా నాన్నతో చెప్పేస్తా పెళ్లి వద్దని కరుణ ఏదైతే అది జరుగుతుంది అంది తీర్మానించుకునట్లుగా…

వామ్మో ఇప్పుడు చెప్పకపోతే ఇది నిజంగా అన్నంత పని చేసేలా ఉంది. అంకుల్ పరువు పోతుంది దీన్ని ఎలాగైనా ఆపాలి అని మనసులో అనుకున్న సుప్రజ.

ఆగవే బాబు నీకు అంత హడావిడి ఎందుకు చెప్తా అంటున్న కదా, ముందు ఆ తలుపు వేసి రా లేదంటే ఎవరైనా వింటారు. మనం రహస్యంగా మాట్లాడుకోవాలి అంది సుప్రజ.

ఇదిగో చూడు ఇప్పుడు చెప్పలేదు అనుకో నీ తల పగలగొడతాను అంటూ వెళ్లి తలుపులు వేసి వచ్చింది కరుణ.

మంచం మధ్యలో బాసింపట్టు వేసుకొని కూర్చున్న సుప్రజ, చిన్నగా రహస్యంగా కరుణతో చూడు కరుణ నేను అన్నీ ఆలోచించే చెప్తున్నాను.

జాగ్రత్తగా విను ఇప్పుడు నువ్వు ఈ పని చేయలేదు అంటే మీ చుట్టాల లో బంధువులలో మీ నాన్నగారి పరువు పోతుంది.

పెళ్లికి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అవుతాయి కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకో అంది సుప్రజ.

నీ బొంద నే నీ బొంద ఏదో చెప్తావు అనుకుంటే పెళ్లి చేసుకోమని చెప్తున్నావా అదే కదా నేను వినిపించడం లేదా నీకు అర్థం కాలేదా అంది కరుణ కోపంగా…

ఇదే మరి తొందర పడటం అంటే మొత్తం వినకుండా మధ్యలోనే మాట్లాడతావు ఎందుకు కాస్త ఆగవచ్చు కదా ముందు నన్ను పూర్తిగా చెప్పనివ్వు ఆ తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో అంది సుప్రజ కూడా కాస్త కోపంగా.

సరే చెప్పి తగలడు అంది అదే కోపంతో కరుణ. అది అలా దారిలోకిరా అంటూ తిరిగి చెప్పడం ప్రారంభించింది సుప్రజ.

కరుణ అనుకున్న సమయానికి మీ పెళ్లి జరగాలని ఆ తర్వాత అతని ఇష్టాలు అయిష్టాలు ఏంటో తెలుసుకుని అతనికి నచ్చని పనులు చేస్తూ తన తో కాపురం చేయకుండా ఏడిపిస్తూ ఉంటే అతనే నువ్వు నాకు వద్దు అనే పరిస్థితి మనం తెచ్చానే అనుకో అప్పుడు అతను నిన్ను వదిలేస్తాడు.

దాంతో నువ్వు మీ వాళ్ల ముందు చెడ్డ దానిగా ఉండలేవు. అందరిలో అతనే చెడ్డవాడిగా మిగులుతాడు. డైవర్స్ వచ్చిన తర్వాత నీ లైఫ్ ని నువ్వు అనుకున్న విధంగా మలచుకోవచ్చు. మీ వాళ్లకు నీ పై సానుభూతి ఉంటుంది అప్పుడు నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా ఎవరూ కాదనరు.

అందువల్ల ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు. అంది సుప్రజా. తిరిగి మళ్ళీ తానే ఎలా ఉంది మన ఐడియా బాగుంది కదా ఇది నచ్చలేదు అనుకో నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు నీకు ఎవరూ చెప్పలేరు.

నీ బాగు కోరే స్నేహితురాలిగా నేను నీకు ఇది చెప్తున్నాను. విని అందర్నీ సంతోష పెడతావో కాదని అందర్నీ కష్టాల్లోకి నెడతావో నీ ఇష్టం ఇక తనకు వచ్చిన ఆలోచన చెప్పి గట్టిగా నిట్టూర్చింది సుప్రజ.

అంతా విన్న కరుణ ఆలోచనలతో బయటకు వచ్చి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అతను నేను తనకు సహకరించడం లేదని మా వాళ్లతో చెప్తే ఏం చేద్దాం అంది సుప్రజ వైపు చూస్తూ…

నీ బొంద నా ప్లాన్ను నీకు అర్థం కాలేదు. అందరి ముందు అతనితో సన్నిహితంగా ఉంటూ బెడ్ రూమ్ కి వచ్చేసరికి నువ్వు అతనికి అనకుండా తప్పించుకో…

అప్పుడు అతను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు, కాబట్టి నువ్వు మీ అత్త మామని మీ తల్లిదండ్రులని అందరినీ నమ్మించు.

ఎలా అంటావా అతనితో సంతోషంగా ఉన్నట్టు నటించడం చేయి. నీ నటన తో అతను పిచ్చెక్కి పోవాలి. చివరికి అమ్మ బాబోయ్ ఇది నాకొద్దు రా అని అతనే తనంతట తానుగా డైవర్స్ కి అప్లై చేసేలా ఉండాలి అర్థమైందా మై డియర్ అంది సుప్రజ.

అమ్మో సుప్రజ ఏమో అనుకున్నాను నీకు కూడా బుర్ర ఉంది ఆట పట్టిస్తూ అంది కరుణ.

నీ బొంద నాకు బుర్ర ఉందే నీకే వాడుకోవడం తెలియదు. మంచి మంచి ఐడియా లు ఇస్తాను. నన్ను చూసి నేర్చుకో, అయితే నీకు ప్లాను ఓకే కదా ఇంకేమీ డౌట్స్ లేవు కదా అంది సుప్రజ.

అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్టు విపులంగా విప్పి చెప్పావు ఇంకేం అనుమానాలు లేవు నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటా నువ్వు చెప్పింది చెయ్యడమే నా పని థాంక్యూ మై డార్లింగ్ అంటూ గట్టిగా ముద్దు పెట్టుకుంది కరుణ.

ఛీ ఇదేం అలవాటే బాబు ముద్దు పెడుతున్నావ్ ఎప్పుడు నేర్చుకున్నావ్ ఇది నన్ను నువ్వు అసలు అమ్మాయి వేనా…? అబ్బాయి లాగా బిహేవ్ చేస్తున్నావ్, ఛీ అంటూ ఎంగిలైన తన బుగ్గని తుడుచుకుంది సుప్రజ.

అదేం లేదు లేవే నాకు ఐడియా బాగా నచ్చింది అందుకే ముద్దు పెట్టాను అమ్మాయిలు ముద్దు పెట్టకూడదా అబ్బాయిలే పెట్టాలా అని తేలికగా కరుణ. సర్లే ప్లాన్ అయితే ఓకే కదా ఇక నువ్వు వేరే ఆలోచన పెట్టుకోకు అంది సుప్రజ.

హా సరేలే ఇంకేమి ఆలోచన లేవు ఇక హాయిగా తిని బజ్జుంట. ఇక నన్నెవరూ ఆపలేరు అంటూ టైం టు పార్టీ నౌ అంటూ డాన్స్ చేయసాగింది కరుణ.

హమ్మయ్య దీని ఆలోచనను మార్చాను, అంకుల్ ఆంటీ పరువు పోకుండా చూడగలిగాను కూతురు మీద ప్రేమ పెంచుకున్న తల్లిదండ్రులు ఇది పెళ్లి వద్దు అని వాళ్ళ పరువు తీసేస్తే ఎంత బాధ పడే వారో ఇప్పటికైతే ఇలా దాటించగలిగాను.

కానీ ముందు ముందు ఇంకా ఏమవుతుందో, ఆ వచ్చే వాడు దీన్ని కంట్రోల్ లో పెడితే అంతా శుభమే, అందరూ సుఖంగా సంతోషంగా ఉండొచ్చు ఉంటారు కూడా అని మనసులో సంతోష పడసాగింది సుప్రజ.

********

ఒరేయి కరుణ పెళ్లి జరిగిపోతుంది. అంతా రెడీ అయ్యింది, ఇంకో రెండు రోజుల్లో పెళ్లి కానీ నువ్వు ఏమి చేయడం లేదు ఎందుకు రా అన్నాడు నరేష్.

హా హా కరుణ పెళ్లి చేసుకోబోతోంది అంతేనా నీ అనుమానం, నేను ఏమి చేయడం లేదనే కదా నీ బాధ ఒరేయి ఇల్లు అలకగానే పండగ కాదు, పెళ్లి కి అంత రెఢీ అవగానే కాదు.

నేను ఏమి పిచ్చివాడిని కాదు. తనను ఎలాగైనా సొంతం చేసుకుంటా, చూస్తూ ఉండు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కదా, చూపిస్తా నా తడాఖా ఏమిటో అన్నాడు కాలర్ ఎగరేస్తూ అరవింద్.

ఏమో ఏం చేస్తవో ఏంటో నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది రా, ఏం చేయబోతున్నారు చెప్పరా అన్నాడు నరేష్.

నువ్వు మూసుకో రా జరగబోయేది చూడు అంతే అన్నాడు కూల్ గా అరవింద్.

ఏంటో నీ వైఖరి నాకు అసలే అర్దం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు ఇంకేం అనలేక నరేష్.

కళ్ళు పెద్దగా చేసుకుని మరీ చూడు నీకే అర్దం అవుతుంది. నేనేం చేయబోతున్నాను అనేది అన్నాడు నవ్వుతూ అరవింద్.

*********

ఏంటండీ మూర్తి గారు ఇదేమన్నా బాగుందా చెప్పండి, రేపిస్తా, మాపిస్తా అంటూ కాలం గడుపుతూ ఉన్నారు తప్ప నా బాకీ సంగతి తేల్చండి అన్నాడు ఫణి భూషణ్ రావు గారు.

ఒక పక్కగా చేతులు నులుముకుంటూ నిల్చున్న మూర్తి గారు, అది కాదండీ అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నా, అందువల్ల కుదరలేదు.

వచ్చే పంట మీద ఖచ్చితంగా మీ బాకీ తిర్చేస్తా కాస్త చూడండి అన్నాడు నెమ్మదిగా..

ఏంటండీ చూసేది మీ వరకు మీ పనులన్నీ కావాలి, మీరు హాయిగా ఉండాలి, నేను మాత్రం నాకి పోవాలి, అంతేనా మీరు అనేది. పదేళ్లుగా అదే మాట చెప్తున్నారు.

ఒక ఏడు పంట రాలేదు అంటారు. ధర లేదని అంటాటు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి అంటున్నారు, ఇలా ఎన్నెల్లు జరుపుతారు? నేను బతకాలి కదా, మరెల చెప్పండి ఇప్పుడు.

ఇంకా ఎన్ని రోజులు అగాలి. ఇది మీకు మంచిగా అనిపిస్తుందో లేదో కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది.

ఎందుకో తెలుసా నా బాకీ తిర్చకుందా నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం వాడికి, వీడికి సమాధానం చెప్పుకోలేక పోతున్నా, ఇవన్నీ కాదండీ నా బాకీ వెంటనే తీర్చండి.

లేదంటే నేను పోలీసులకు చెప్పాల్సి వస్తుంది అన్నాడు సీరియస్ గా ఫణి భూషణ్ రావు గారు.

అయ్యయ్యో అలా అనకండి భూషణ్ గారు, మూర్తి గారు ఇప్పటికీ ఇప్పుడంటే ఎలా తీరుస్తారు చెప్పండి. పాపం పడేకరలు ఉంది.

అప్పుడెప్పుడో పొలలని బాగా చూసుకోవాలని మందులు కొట్టించడానికి మీ దగ్గర తీసుకున్నది నిజమే అయినా పంట బాగా రాకపోతే ఆయన మాత్రం ఎలా తీరుస్తారు అన్నాడు మధ్వర్తి నాగయ్య.

భలే చెప్తారు మీరు ఎన్నేళ్ళు అండి పంట బాగా లేదని సాకు చెప్తూ తన అవసరాలు తీర్చుకుంటున్నాడు.

కానీ బాకీ కట్టమంటే మాత్రం ఎక్కడ లేని అవసరాలు బాధలు ముందు పెడతారు నా నోరు నొక్కుతారు. తొందరలో నా కొడుక్కు పెళ్లి చేయాలి అనుకుంటున్నా, ఖర్చులకు కావాలి కదా, అవేవో ఇచ్చేస్తే ఇన్ని మాటలు ఉండవు కదా అన్నాడు భూషణ్ గారు.

అవునా అసలు విషయం తెలియక నేనేదో వాగాను, ఏమండీ మూర్తి గారు ఏమంటారు అన్నాడు నాగయ్య.

మూర్తి గారు తలెత్తి చూసి అయ్యా నా కూతురు పెళ్లి రెండు రోజుల్లో ఉంది. అదయ్యాక చూసుకుందాం ఇప్పుడు ఈ విషయం పెళ్లి వారికి తెలిస్తే బాగోదు అన్నాడు నెమ్మదిగా.

ఆహా అవునా మీరేమో పెళ్ళిళ్ళు చేస్తూ ఉండండి నేనేమో చూస్తూ కూర్చుంట, లేదండీ మూర్తి గారు నాకు డబ్బులు కావాల్సిందే అన్నాడు ఖచ్చితంగా ఫణి భూషణ్ గారు.

అయ్యా మరి ఇంత ఖచ్చితం అంటే ఇప్పటికిప్పుడు పది లక్షలు ఎక్కడి నుండి తేవాలి, కాస్త కనికరం చూపండి అన్నాడు మూర్తి గారు.

లేదండీ కుదరదు మీరేం చేస్తారో నాకు అనవసరం నా డబ్బులు నాకు ఇవ్వండి తేల్చారు భూషణ్ గారు.

నాగయ్య గారు మాట్లాడరేమిటండీ కాస్త మీరయిన చెప్పండి అన్నాడు మూర్తి గారు. ఏం మాట్లాడను ఇద్దరికీ ఇబ్బంది గానే ఉంది అటూ చూస్తే కూతురి పెళ్లి ఇటూ చూస్తే కొడుకు పెళ్లి ఏం చెప్తాను నేను అన్నారు నాగయ్య. చూడండి నాగయ్య గారు ఏదో ఒక ఉపాయం చెప్పండి అన్నారు మూర్తి గారు.

కాస్త ఆలోచించిన నాగయ్య అయ్యా కాస్త ఇటు వినండి అన్నారు భూషణ్ గారు వైపు చూస్తూ, డబ్బు అడగకూడదు అనే మాట తప్ప ఇంకేమైనా చెప్పండి అన్నాడు భూషణ్ గారు.

విన్నాక మీరే ఎగిరి గంతులు వేస్తారు మరి వింటే బాగుంటుంది అన్నాడు నాగయ్య, అంతా ఎగిరి గంతులు వేసే విషయం ఏమిటో.. చెప్పండి విని తరిస్తా అన్నాడు భూషణ్ గారు.

నాగయ్య ఏం చెప్పబోతున్నాడు అంటూ ఆసక్తి గా చూస్తున్నారు మూర్తి గారు.. మరి నాగయ్య చెప్పే విషయం ఏమిటి? మూర్తి గారు బాకీ ఎలా తీరుస్తారో తదుపరి భాగం లో చదవండి…..

– భవ్య చారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *