1979వ సంవత్సరం రాత్రి ఎనిమిది గంటలు, అప్పటికే ఊరంతా సద్దుమణిగింది. అందరం తినేసి పడుకున్నాం, నిద్రలో ఉన్నారు అందరూ కానీ, నాకు మాత్రం నిద్ర రావడం లేదు. ఎందుకో గుబులుగా ఉంది. ఇంట్లో వాళ్లను వదిలి వెళ్లాలి అంటే ఆ మాత్రం గుబులుగా దిగులుగా ఉంది.
అవును నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. మీరు విన్నది నిజమే, నేను అమర్ తో కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నా అమర్ నా కోసం ఎదురు చూస్తూ పక్క వీధిలో లారీ పెట్టుకుని ఉన్నాడు.
లారీలో మా జీవితానికి కావాల్సిన సామాను అంతా ఉంది మరి, అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం. అతను ముస్లిం, నేను హిందూవును కాబట్టి మా ప్రేమ విషయం ఎవరికైనా తెలిస్తే మమల్ని బ్రతకనివ్వరు. కాబట్టి, మేము ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవాలని అదే, సమాజం బాషలో లేచిపోవాలని నిర్ణయించుకున్నాం.
ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తున్న అమర్ కోసం నేను వెళ్లాలి అని అనుకుంటూ దుప్పటి తీసి లేచాను. మెల్లిగా తలుపులు దగ్గరికి చప్పుడు కాకుండా వెళ్ళి గొళ్ళెం తీశాను. బయటకు నడిచే ముందు అందర్నీ ఒక సారి చూశాను నన్ను కన్నా వాళ్ళు, నా తోబుట్టువులు, నా చిన్నమ్మలు, పెదమ్మలు, బబాయిలు, ఇలా అందర్నీ వదిలి వెళ్తునందుకు చాలా బాధ గా ఉన్నా ప్రేమించిన వాడి కోసం వెళ్ళాక తప్పదు.
మంచి జీవితం అనుభవించాలి అంటే ఇప్పుడు ఈ బంధాలు అన్ని తెంచుకుని వెళ్లాలి అని అనుకుంటూ తల తిప్పేసుకుని బయటకు అడుగులు వేసాను.. నాలుగు అడుగులు వేశాక వెళ్తున్నావా అంటూ మా అక్క గొంతు వినిపించడంతో ఉలికి పడి వెనక్కి తిరిగి చూశాను.
అక్కడ అక్క నిలబడి ఉంది. దాంతో, నాకు చాలా భయం వేసింది. అక్క నన్ను తిరిగి, వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు అక్కడ వాడు నీ కోసం ఎదురచూస్తు ఉన్నాడు కదా వెళ్ళు, నీ సంతోషం నికు ముఖ్యం కదా వెళ్ళు, నీ సుఖం నువ్వు చూసుకో నువ్వు వెళ్ళావు అని తెలిసిన మరుక్షణం ఏం జరుగుతుందో నికు చెప్తాను అప్పుడు కూడా నువ్వు వెళ్లాలి అని ఉంటే తప్పకుండా వెళ్ళు అంది. నేను ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడిపోయను..
శారద, నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా నాన్న గుండె పగిలి చనిపోతారు, లోకులు అనే మాటలకు అమ్మ ఉరేసుకుంటుంది. పెదమ్మ పేద నాన్నలు, బాబాయిలు మమల్ని ఇంట్లో నుండి వెళ్ళ గొడతారు. లేచి పోయిన దాని అక్క అంటూ నాకు సంభందాలు రావు. నాతో పాటే చెల్లెళ్ళకు కూడా ఎలాంటి సంభందాలు రావు. మాకు తిండి దొరకదు, ఎవరు మమల్ని దగ్గరికి కూడా రానివ్వరు. మాకు అన్నం దొరక్క మేము ఎవరూ దగ్గరికి తియ్యక మేము ఆకలితో చచ్చి పోతాము.
సంకెళ్ళు
ఇప్పటికే అర కొర ఆహారం దొరికితే దాన్నే అపురూపంగా తింటున్నాం, ఇప్పుడు నువ్వు లేచిపోతే ఇక అది కూడా మాకు దక్కదు. చిన్న చెల్లి ఏ పాపం చేసిందే అది కూడా చనిపోతుంది. అయినా, నికు ఇవ్వన్నీ అవసరం లేదు కదా, నీ సంతోషం, నీ సుఖం, నీ ఇష్టం నీదే కదా, వెళ్ళు వెళ్లి వాడితో సంతోషంగా గడుపు..
వాడే నీకు ముఖ్యం కదా, వాడంటే నీకు చాలా ఇష్టం కదా, వెళ్ళు వెళ్లి నీ సంతోషాన్ని వెతుక్కో, మా ఆరుగురి శవాల మీద నుండి నడిచి వెళ్లి, నీ సుఖాన్ని చూసుకో అంటూ చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ కింద కూలబడిన అక్కను చూస్తున్న నాకు దుఖం ఆగలేదు..
అక్కా నేను అంత దూరం ఆలోచించలేదక్కా, నాకు పెళ్ళి అయితే అందరం బాగుంటాం అని వెళ్లడానికి సిద్ధ పడ్డాను, మీరందరూ చనిపోతారు అంటే నేను ఎక్కడికి వెళ్ళను అక్కా నన్ను క్షమించు అక్కా, నేను ఇదంతా ఆలోచించలేదు అంటూ అక్క చేతులు పట్టుకున్నా ,
అక్కా ఇది అంతా అబద్దం చెప్తుంది, నువ్వు ఎక్కడ సుఖ పడ్తావో అని దీనికి కుళ్ళు అక్కా, నువ్వు వెళ్ళిపో అక్కా అంటూ మా తమ్ముడు నన్ను చేయింపట్టుకుని అమర్ దగ్గర కు నేను నీకు తోడుగా వచ్చి దిగబెడతాను అన్నాడు నన్ను లాక్కువెళ్తూ .
వద్దురా, వద్దు నేను రాను నా వాళ్ళు బాగుండాలి నేను అందరితో కలిసి ఉండాలి, నా వల్ల ఎవరూ బాధపడకూడదు, నేను ఎవరిని బాధ పెట్టను వెళ్ళనురా, వదిలెయ్యి అంటూ
ఏడుస్తున్న శారద తన పై ఏదో నీడ పడడం చూసి తలెత్తి చూసింది అక్కడ అమర్ నిలబడి ఉన్నాడు.. ఎప్పటి నుండి వింటున్నాడో మా మాటలు దగ్గరికి వస్తూ .
సంకెళ్ళు
శారదను చూస్తూ, ఏంటి శారద? నీకు నా ప్రేమ కనిపించడం లేదా? నీ వాళ్ళ కోసం నన్ను వదులుకుంటావా, ఇన్నేళ్లు నేను నీ ప్రేమ కోసం ఎంతగా తపించిపోయానో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, నువ్వు నన్ను కాదని నీకు నువ్వు సంకెళ్లు వేసుకుంటున్నావు కదా!
నిన్ను ప్రేమించిన అంతగా నేను ఎవర్ని ప్రేమించలేదు. నన్ను ఇప్పుడు కాదు అంటున్నావు, ఏ ప్రేమను అయితే కాదని అంటున్నావు ఆ ప్రేమ నికు దొరకక జీవితాంతం కుమిలిపోతావు, చూడు అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు.
అలా మా అక్క వేసిన బంధాల సంకెళ్లను తెంచుకుని నేను అమర్ తో వెళ్ళలేకపోయాను, కొన్నాళ్ళ తరువాత నిజంగానే నాకు ప్రేమించని భర్త దొరకడంతో నేను ప్రేమకు మొహం వాచి పోయాను అతని శాపం నిజమయ్యింది…