సంక్రాంతి ఉదయం

సంక్రాంతి ఉదయం

ప్రకృతి ప్రేమ లో
పరువళ్ళు త్రోక్కుతూ
మకర సంక్రాంతి మసక వన్నెల్లో
మనసు మంత్ర ముగ్ద మైన
ముగ్గుల రంగుల్లో…
వెచ్చని పచ్చని ఉదయం
స్వాగతం చెప్పిన వేళలో
వసంత గాలి, తాటి చప్పుళ్ళు
బసవన్న అమాయకపు ఎదురు చూపు…
ఏదో ఇస్తూ…. తీసుకుంటూ….
మౌనంగా మాట్లాడుతుంటే
సత్యమే శివమైతే….
అదే సుందరం… కదా…
మంచు పొగల్లో….
మెత్తగా మకరాదిత్య కిరణాలు
హృద్యంగా పలకరించే….
వసుధ్యేక కుటుంబం లో
కల కాలం సుఖ సంతోషాలతో
కలిసిఉండాలని
దీవిస్తూ….
చిగురించే కొత్త విజయాలను
సాధించి ఆస్వాదించాలని
ప్రసాధించే ఉదయం…
మకర సంక్రాంతి ఉదయం
అందుకే
పూజ్యులు, పెద్దలు, పిన్నలు
స్నేహితులు అందరికి పేరు పేరున మకర సంక్రాంతి
హృదయ పూర్వక శుభాకాంక్షలు.

– అల్లావుద్దీన్

Related Posts