సన్మార్గము

సన్మార్గము

కోట్లకు
పడగలెత్తితివా….!

నీవు తొక్కిన
మార్గము
నిన్ను
సన్మానించిన నది
సన్మార్గమౌనా……..!

వేతనాలు ఇచ్చి
పెత్తనాలు చేసిన
అన్నం పెట్టినట్లు ఔనా…!

నీవు
త్రాగు నీట
సువర్ణ భస్మమా…….!

నా
గుక్కెడు నీట స్వేదమా….!

నాది,
నడక లేని నడక
కొలత లేని దూరం.
ఆదే…… తుది
జీవితాంతము.
నాది సన్మార్గము…………!

– వాసు

Related Posts