సంతృప్తి

సంతృప్తి

సంతృప్తి

ఏది సంతృప్తి….. ఎక్కడ సంతృప్తి..

సనాతన వైదిక భారతంలో
నవయువ నూతన భారతంలో
వజ్రోత్సవాల నవీన భారతంలో
ఏది సంతృప్తి…. ఎక్కడ సంతృప్తి..

అన్నింటా వర్గాలు పెరిగిపోయాయి..
అందరూ అన్నిరకాలుగా విడిపోయారు.
భారతీయతను బంధీ చేశారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని.. చిన్నాభిన్నం చేశారు
ఏది సంతృప్తి…. ఎక్కడ సంతృప్తి…

ఓ పక్క కులాల కుమ్ములాట..
మరోపక్క మతాల ముసుగులాట
ఇంకోపక్క ప్రాంతాల పీకులాట.‌
ఏది సంతృప్తి… ఎక్కడ సంతృప్తి..

ఆ రంగం..ఈ రంగం..ఏ రంగమైనా..
మావాడు.. మీ వాడు..ఎవరివాడైనా సరే..
తన మన భావజాలం మరచిననాడు.
స్వార్ధాన్ని మరచి దేశాన్ని ప్రేమించిన నాడు..

నిజమైన సంతృప్తి… అసలైన సంతృప్తి..

– కిరీటి పుత్ర రామకూరి

తగునా సఖియా! Previous post తగునా సఖియా!
సంతృప్తి Next post సంతృప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *