సంతోషం

సంతోషం

సంతోషం సగం బలం అంటారు
సంతోషాన్ని వెతికే చోటు
వుండదు చూసే మనసు
మాత్రమే నిజమైనసంతోషం

అనుకున్నది జరిగితే సంతోషం .
మంచివిషయాన్ని పంచితే
సంతోషం
ఎదుటివారిని ప్రేమిస్తే
సంతోషం
గెలుపును చూస్తే
సంతోషం
మనసుతో మాట్లాడితే
సంతోషం
పోల్చు కోకుండా ఉండటం
సంతోషం
నిజాలను మాట్లాడం
సంతోషం
నచ్చిన పని చేయడం
సంతోషం
ఇష్టంతో చేసే పని
సంతోషం
మెచ్చిన మనుషులతో వుండటం సంతోషం
ప్రశాంతంగా గడపటం
సంతోషం
తప్పు ఒప్పులు లెక్కలు వేయకపోవడం సంతోషం
ఎదుటివారి నుండి ఏమి
ఆశించక పోవడం
సంతోషం
మంచిని కోరుకోవడం
సంతోషం
ఉన్నదానితో సరిపెట్టు
కోవడం సంతోషం
ప్రతిపని లో సంతోషాన్ని
వెతకడం సంతోషం
డబ్బుకు సంతోషానికి పోటీ
లేకపోవడం సంతోషం
వెతక కుండా పొందేటి
అనుబూతి సంతోషం
“అక్షయ పాత్ర లాంటి”
సంతోషాన్ని చిరునవ్వుతో ఆస్వాదిస్తూ పట్టలేని సంతోషాలను మాత్రమే
మిగుల్చుకోవాలి అందరు…..

– జి జయ

Related Posts