సరస్వతీ కటాక్షం మొదటి భాగం
1. ప్రస్తావన :-
సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా || పద్మ పత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణిని | నిత్యం పద్మాలయాం దేవీ సమాంపాతు సరస్వతీ ||
అందరూ మనుషులు శక్తిని నమ్మి జీవిస్తున్నారు. ఒక పని నిర్విఘ్నంగా జరగాలంటే అందుకు శక్తి ఎంతో అవసరము. ఎంతటి లక్ష్మీ సంపన్నులైన కుబేరులైనా, సరస్వతీ కటాక్షము లేనిదే నిరుపేద వారితో సమానము. వారి జీవితములో ఒక్క చిన్న తప్పటి సంతకము చాలు వారినించి లక్ష్మీ మాత విడిపోవడానికి. అది సంతకముకున్న విలువ, సరస్వతీ అమ్మవారి మహిమ. సరస్వతి కటాక్షం ఉన్నవారు నిరుపేదలైనా మహారాజులతో సమానహోదా అనుభవిస్తారు. అలాంటివారు ఏదేశమునైనా మహారాజులే. ఈ కథ ఒక పేద కుటుంబంతో పుట్టిన ఒక సరస్వతీ పుత్రుని కథ. అతను తన జీవితములో ఎదురైన ఇబ్బందునించి, ఆ అమ్మవారు ఎలా బుద్ధిని ప్రసాదిస్తారో చూడండి.
ఈ కధలో బయటపడటానికి అతని పుస్తక ప్రయాణం ఎలా మొదలయింది, ఎలా కొనసాగింది, అనే ఘట్టం మొదటిది. ఆ తర్వాత ఘట్టం ఆనందమైన జీవితములో అపశ్రుతులు. ఈ ఘట్టంలో తన ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఒచ్చాయి, మరియు ఎంత తీవ్రతలో ఢీకొన్నాయి. అనేవి క్లుప్తంగా చెప్పబడినది. ఇక మూడో ఘట్టం పద్యం మద్యం గా మారితే..? ఇక నాలుగో ఘట్టం. కామం మేఘాన్ని తరిమేసిన ప్రేమ సూర్యోదయం. ఆఖిరి ఘట్టం పేరు ‘ఒపసంహారం.’ ఇలా మన కథానాయకుని కథలో ఎవ్వరూ విలన్లు లేరు, సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులని మనము విలన్లుగా భావించవచ్చు. నీ శత్రువుని చూస్తే, నీ వ్యక్తిత్వం తెలుస్తుంది. అలానే ఈ కథలో కథానాయకుడిని అత్యున్నత శిఖరాలకు తీసుకెల్లబోయేది తన సమస్యల సునామీ, భూకంప తీవ్రతలు మాత్రమే. తన నమ్మకమే తన ఆయుధమయి పోరాడుతు ఉంటే విధి సైతం తల ఒంచేస్తుంది అని ఇదే నిదర్శనము.
సరస్వతీ కటాక్షం అంటే ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే శారదా అమ్మవారు దర్శించి వరం ఇస్తారు అని భావించి ఉండవచ్చు. కానీ దీని అసలు అర్ధం ఏమిటంటే సమాజంలో ఉన్న పేదరికాన్ని చదువు పట్ల ఉన్న ధ్యాన వలన ఎలా ఉన్నతంగా బ్రతకొచ్చు, పేదరికాన్ని క్రమబద్ధంగా నిర్మూలించవచ్చు అన్నది ప్రస్తుతించబడినది. విద్య అంటే లక్షీ మరియు డబ్బు మాత్రమే కాదు, ఇది ఒక సంస్కారం, మరియు జీవన విధానము. ఇతరులపై ఫిర్యాదు చేయకూడదని, మీకు శాంతి కావాలంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలని జీవితం అతనికి నేర్పింది. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని రెడ్ కార్పెట్ చేయడం కంటే చెప్పులతో మీ పాదాలను రక్షించుకోవడం సులభం…సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరు చూట్టాలే… అదే లేనివాడికి కష్టం వస్తే ఐనవాడు కూడ పలకరించడు…! కాబట్టి కష్ట పడి తను ఉన్నతం గా ఉండలని చిన్నతనం లో బోధ పడి, ఎన్నో అవమానాల, ఓటముల మధ్య నేర్చుకుని విజయవంతమైన జీవితం సాధించే ఒక యువకుని కథ ఇది.
-హరీశ్వర్