సత్యాన్వేషణ

సత్యాన్వేషణ

రెక్కల మాటున రంగుల మాటున
విన్యాసాల భ్రమరానిది
భ్రమణకాంక్షని భ్రమపడుతుంటాం

నవ్వుల మాటున క్రీగంట చూపుల వెనక
మనిషి తనని తాను దాచుకుంటాడని గ్రహించం

భ్రమరం అన్వేషణను
పూవు స్వాగతిస్తుంది
తేనె తోటి అతిథిని సత్కరిస్తానని
తృప్తి పడుతుంది

మనిషి నవ్వు స్వచ్ఛమైనదో కుచ్చితమైనదో
దగ్గరకొచ్చినా తెలియకపోవచ్చు
వాటేస్తాడో కాటేస్తాడో అంతా రహస్యమే

మళ్లీ భ్రమరనాదం మోగుతోంది మనసు నిండా
కల్మషం లేని కీటకం
ఆటంకాల మనిషి కన్నా
ఎంతో మిన్నన్న సత్యం
తేనె బొట్టులా కారటమే సత్యావిష్కరణ

– సి.యస్.రాంబాబు

Related Posts