సత్యాన్వేషి

సత్యాన్వేషి

ఉదయాన్ని ప్రార్థించాను
జీవితాన్నో ఉద్యానవనం చేయమని
చేరువకాని వ్యక్తుల జ్ఞాపకాలతోట వేద్దామని

ఉదయాన్ని మరోసారి వేడుకున్నాను
మునిమాపువేళలో..మీదపడే వ్యక్తులండరు
మిగిలిపోయిన అనుభూతులే ఉంటాయని

ఉదయానికి గుర్తుచేశాను
నిన్న బాధించుండొచ్చు..రేపటి భరోసా లేకపోవచ్చు..వర్తమానమే సత్యమని…

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *