సెకండ్ లవ్

సెకండ్ లవ్

సాయి: ఐ లవ్ యూ కృష్ణవేణి

కృష్ణవేణి: మీకు నా గురించి తెలిసి కుడా ఎందుకు చెప్పాలి అనిపించింది అండి?

సాయి: అందరికీ పాస్ట్ పాస్ట్ ఉంటుంది అలా అని వేరే వాళ్ళని లవ్ చెయ్యకుండా ఉండలేము కదా….

కృష్ణవేణి: బాయ్

అభి: ఏమైంది రా?

సాయి: తెలిసిందే కదా నో అన్నది…

అభి: ఎందుకు అంటా?

సాయి: అదే వాడి వల్ల…. అందరికి పాస్ట్ ఉంటది కదా తను కూడా అందుకే అంత ఫీల్ అవుతుంది…

అభి:కొంతమంది అంతే.. నీలా…

సాయి: నేనా…!?

అభి: నువ్వు ఈమెని లవ్ చెయ్యడానికి ఎన్ని మంత్స్ అయింది?

సాయి: బాయ్స్ లేట్ గా మర్చిపోతారు కదా…

అభి: బాయ్స్ గర్ల్స్ అని ఉండదు సీరియస్ గా లవ్ చేస్తే ఇద్దరికీ సెం టైం… అలాగే వాళ్ళ సరౌండింగ్స్ ని బట్టి ఉంటుంది…

సాయి: ఓహో అవునా,,,

అఖిల్: ఏంటి రా ఏమైంది?

సాయి: ఎం కాలేదు రా ప్రపోజ్ చేసాను కానీ నో చెప్పింది…

అఖిల్: ఎందుకు?

సాయి: తను పాస్ట్ లో ఒకతన్ని లవ్ చేసింది ఫుల్ గా…

అఖిల్: నీకు ఆ లవ్ స్టొరీ తెలిస్తే కొంచం చెప్పు…

సాయి: ఎం లేదు తను ఒకతన్ని లవ్ చేసి ప్రపోజ్ చేసింది తను ఒప్పుకున్నాడు, కానీ ఈమె ప్రేమించినంత ట్రూ గా తను లవ్ చెయ్యలేదు కొన్ని రోజులకి బ్రేకప్ చెప్పాడు… ఆ బాధలో ఉంది తను ఇంకా… అందుకే నన్ను రిజెక్ట్ చేసింది…

అఖిల్ ఓహ్ అవునా…!

సాయి: హా అవునే,,,

అఖిల్: సరే కొత్తగా ట్రై చెయ్ మరి…

సాయి: అదే ఆలోచిస్తున్నా.. చూద్దాం…

నెక్స్ట్ డే….

సాయి: నిన్న అలా చెప్పినందుకు సారీ.. ఏమన్నా ఫీల్ అయ్యావా…!?

కృష్ణవేణి: లేదు ఎం ఫీల్ అవ్వలేదు.. సారీ ఎందుకు చెప్తావ్? నీ ఫీలింగ్స్ చెప్పావు అంతే కదా….

సాయి: కానీ నువ్వు ఫీల్ అయినట్టు నాకు అనిపించింది అందుకే….

కృష్ణవేణి: అలా ఎం లేదు… కానీ ఇంకోసారి ఇలా చెయ్యకు అంతే…

సాయి: సరే… తిన్నావా?

కృష్ణవేణి: హా తిన్నాను.. నువ్వు…?

సాయి: లేదు ఇంకా తినలేదు…

కృష్ణవేణి: ఎందుకు

సాయి: ఇష్టం లేదు

కృష్ణవేణి: అరె.. బాబు తిను వెళ్ళి.. లేట్ గా తింటే అరగదు…

సాయి: తినకపోతే నువ్వు తినిపిస్తావా ఏంటి? అలా అంటున్నావ్

కృష్ణవేణి: హా తినిపిస్తా…

సాయి: హా బాగానే చెప్తున్నావ్…

కృష్ణవేణి: ఏంటి?

సాయి: నిజాలు

కృష్ణవేణి: హా నిజమే కదా….

సాయి: సరే సరే…

కృష్ణవేణి: వెళ్లి తిను ముందు…

సాయి: ఇంటరెస్ట్ లేదు అన్నాను కదా ఎందుకు ఫోర్స్ చేస్తావ్?

కృష్ణవేణి: నాకోసం తిను ప్లీజ్….

సాయి: నీకోసం తినడం ఏంటి… ఎన్ని యుద్దాలు అయినా చెయ్యొచ్చు….

నెక్స్ట్ డే…

సాయి: నీకు సాంబార్ రైస్ అంటే ఇష్టం కదా వెళ్దామా బైటకి? ఇక్కడ ఒక హోటల్ చాలా ఫేమస్…

కృష్ణవేణి: అవునా… సరే పదా…

అభి: హలో… ఎక్కడ ఉన్నావు రా?

సాయి: కృష్ణవేణి తో బయటకి వెళ్తున్నా రా…

అభి: నో చెప్పాక కూడానా రా? ఎలా రా?

సాయి: రేయ్ ఒక్క నిమిషం చాలు రా ఒపినియన్ మారిపోవడానికి…

అభి: అబ్బో…

సాయి: నువ్వు కూడా రారా…

అభి: ఎక్కడికి?

సాయి: అదే ఇక్కడ సాంబార్ రైస్ ఫేమస్ కదా… 

అభి: సరేరా వస్తున్నా…

సాయి: హలో ఎక్కడ ఉన్నావు?

కృష్ణవేణి: అది నేను అడగాలి…

సాయి: నీ హార్ట్ లో ఉన్నాను….

కృష్ణవేణి: అబ్బో.. ఇక్కడ ఒక అమ్మాయి బాగుంది త్వరగా రా… లేకపోతే వెళ్ళిపోతుంది…

సాయి: నీకన్నా మంచి అమ్మాయిలు ఉండరు లే…

కృష్ణవేణి: అబ్బో….

అభి: ఆ ఒక్క నిమిషం వస్తుంది అంటావా?

సాయి: నాకైతే నమ్మకం ఉంది… త్వరగా వెళ్దాం పద… హలో ఉన్నావా?

కృష్ణవేణి: హా ఏంటి ఆ ఒక్క నిమిషం?

సాయి: ఏమి లేదు మేము వచ్చేసాం…. ఆర్డర్ చేసావా?

కృష్ణవేణి: హా చేసాను

అభి: రేయ్ చెప్పు రా

సాయి: రేయ్ వద్దు రా.. తనకి నచ్చదు

కృష్ణవేణి: దేని గురించి అంటున్నారు?

అభి: అదే నీకు అప్పుడు చెప్పాడు కదా…

కృష్ణవేణి: ఓహ్ అదా… ఇప్పుడు సార్ కి ఇంటరెస్ట్ లేదు లే…

సాయి: హే ఏంటి నువ్వు కూడా…

అభి: మరి చెప్పు రా…

సాయి: నేను ఏమి ఫేక్ మాటలు చెప్పట్లేదు… ఉన్నన్ని రోజులు నిన్ను విడిచిపెట్టను….

కృష్ణవేణి: విదిచిపెడ్తె బాగోదు మరి…

సాయి: వదలను నిజం… 

ఒక బ్రేకప్ అయిన తర్వాత మనం వేరొకరిని లవ్ చెయ్యలేము.. కానీ మనకోసం ఒకరు ఎప్పటికీ ఉంటారు అని నమ్మితే సెకండ్ లవ్ చెయ్యొచ్చు… 

– విగ్నేష్ సాయి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *