సీమచింతకాయలు

సీమచింతకాయలు

సీమచింతకాయలు చిన్నప్పటి జ్ఞాపకం.

కొంకి కర్రలు పట్టుకుని మిట్ట మధ్యాహ్నం సీమచింతకాయ చెట్లమ్మటే ఒక బాచ్ నందరిని వెనకేసుకుని ,అమ్మానాన్నలు తిడుతున్నా, ముల్లు గుచ్చుకుంటున్నా ఎగబాకుకుంటూ తిరగటం చిన్నప్పటి తీయని అనుభూతి.

అమ్ముమ్మ వాళ్ళింటికి వెళితే అక్కడ ఇంకా ముంజె కాయలు కూడా దొరికేవి. వేసవి కాలం టిఫిన్ లు ఇవ్వే పిల్లలకి.

ఎర్రగా పండిన వాటిని లొడ్డాలనేవారం.అదిగో చూడు,ఇదిగో చూడు అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఎకఎకలు పకపకలు.ఆ
రోజులే వేరు.

పొలాల్లోకి వెళితే బొబ్బట్టు,పిల్లిమిసర కాయలు,వేరుశనగ దుబ్బుల్ని లాక్కుని ఆ పచ్చి వేరుశనగ కాయలు,భలే తియ్యగా ఉండేవి.ఆ ప్రకృతి ఆహారం తినడం వలననే ఇంకా ఈ మాత్రం ఓపికగా ఉన్నామంటే నమ్మండి. ఆ ప్రకృతితో మమేకమైన జీవనం మూలంగానేనేమోఈ మాత్రం సంతోషం గా బ్రతకటం. ఇప్పటి వాళ్ళకి ఈ పేర్లుకూడా తెలియవేమో.పానీ పూరీలు, చెత్త తప్పితే ఏమీ తెలియదు ఈ తరానికి. 

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *