శెలవు రోజు కూడానా!?
నాన్నని ఈరోజు వాటర్ వరల్డ్ కి తీస్కెలమని అడిగింది లిక్కి వాళ్ళ నాన్నని.అలాగే లిక్కీ తీస్కెళ్తారు కానీ ఇవాళ కాదు రేపు సండే కదా ఇవాల నీ స్కూల్ కి సెలవు కానీ నాన్నకి ఆఫీస్ ఉందికదా అని చెప్పింది లిక్కీ తో వాళ్ళ అమ్మ..సరే సాయంత్రం తొందరగా రమ్మంది నాన్నని లిక్కీ…సరే వస్తాను నువ్వు రెడీ గా వుండు సరేనా ట ట.. అని నాన్న వెళ్ళిపోయారు…
సాయంత్రం లిక్కీ రెడీ అయ్యి వుంది కానీ నాన్న రాలేదు..
రాత్రి అయిపొతోంది ఇంక వెళ్ళి అమ్మని అడిగింది.. నాన్న కి ఫోన్ చెయ్యి అని..నేను చాలాసేపటి నుంచి చేస్తున్నాను కానీ నాన్న ఫోన్ కలవలేదు..అవునా సరే పద పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని అంది లిక్కీ.. నాన్న వస్తారు అన్ని చెప్పిన వినలేదు.. ఇద్దరు కలిసి స్టేషన్ కి వెళ్ళారు..సార్ లేరు మేడం.. అని కానిస్టేబుల్ చెప్పాడు..
ఏక్కడికెళ్ళారు అని అడిగింది లిక్కీ..ఎదో దొంగతనం జరిగితే దొంగని వెతకడానికి వెళ్లారు అని చెప్పాడు…
ఎప్పుడు వస్తారు అని అడిగింది లిక్కీ జాలిగా.. ఎందుకు అని అడిగాడు ఆ కానిస్టేబుల్.. నాన్న తో పార్క్ కి వెళ్దాం అనుకున్న కానీ ఇప్పుడు చీకటి పడిపోయింది అంటూ లిక్కీ మొహం చిన్నబోయింది..
అయ్యో వస్తారు నువ్వు ఇంటికెళ్ళి పడుకో.. మేడం వెళ్ళండి ఆయన రాగానే నేను సార్ కి చెప్తాను అని కానిస్టేబుల్ చెప్పాడు..ఇద్దరు ఇంటికి వచ్చారు.. లిక్కీ వాళ్ళ నాన్న కోసం చూస్తూ పడుకునిపోయింది…తెల్లారింది, లిక్కీ లేచి నాన్న నాన్నా.. అంటూ హల్ లోకి వొచ్చింది..అమ్మని చూసి ఇవాళ వాటర్ వరల్డ్ కి తీస్కెళ్తా అన్నారు నాన్న.. నన్ను రెడీ చేయి అని అంది..లిక్కీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు.. ఏపుడు వొస్తారో తెలీదు అని అంది.. లిక్కీ కి చాలా బాధ వేసింది నాకు ఎవరు వొద్దు, నన్ను ఎక్కడకి తీసుకువెళ్ళరు అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది.. అమ్మ ఎన్ని చెప్పిన వినలేదు.. బతిమాలగా సాయంత్రానికి అన్నం తింది లిక్కీ..
ఇంతలో నాన్న వొచ్చారు.. ఎదో కంగారుగా వొచ్చి యూనిఫాం తీసేసి బట్టలు మార్చుకుని ఫోన్ లో ఎదో దొంగతనం గురించి మాట్లాడుతూ వెళ్లిపోతున్నారు.. ఇంతలో ఆయనకి లిక్కీ గుర్తొచ్చింది.. వెతుకుంటు లోపలికి వొచ్చారు..సోరీ లిక్కీ నాన్న పోలీస్ కదా దొంగలని పట్టుకోవాలి కదా అందుకే నేను నిన్ను వాటర్ వరల్డ్ కి తిస్కెళ్ళలేదు ఈసారి వెళ్దాం అని చెప్పారు.. కానీ లిక్కీ ఏడుపు ఆపలేదు..
అమ్మ కూడా చాలా బాధ పడింది అటు డ్యూటీ ఇటు లిక్కీ ఇద్దరికి న్యాయం చేయడం కుదరని ఉద్యోగం, నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి అమ్మ లిక్కీని దగ్గరకి తిస్కుంది… ట ట అని చెప్పి భాదగా వెళ్ళిపోయారు నాన్న…
కానీ ఏదో బాధ పాపం లిక్కీ అని.. స్టేషన్ కి వెళ్ళాక దొంగ దొరికినట్టు కాల్ వొచ్చింది.. వెంటనే ఇంటికి వెళ్లిపోయి.. లిక్కీ.. లిక్కీ అంటూ పాపని ఎత్తుకొని ఆనందపడ్డారు నాన్న.. అమ్మ కూడా ఆనందంగా ఎంటి వొచ్చేసారు అని అడిగింది.. దొంగ దొరికాడు అందుకే వొచ్చేసా అన్నారు నాన్న..
అవునా ఇప్పుడు వెళ్దామా వాటర్ వరల్డ్ కి అని అడిగింది లిక్కీ..ఇప్పుడు చీకటి అయిపొయింది కదా మూసేస్తారు.. సినిమాకి వెళ్దామా అని అడిగారు.. సరే నాన్న అంది లిక్కీ…
సెలవు రోజే కాదు మామూలు రోజుల్లో కూడా పోలీసులకి ఖాళి వుండదు..
-శ్రీ కిరణ్