సెలవు

సెలవు

సెలవు

సాయం సంధ్య వెలుగులా
శ్రావణం నీటిచుక్కై పలకరిస్తుంది
ఒళ్ళంతా చల్లగాలితో పులకరిస్తుంది
మెత్తని కల చెట్టుమానులా చెట్టాపట్టాలేసుకుంటూ
కన్ను గీటుతుంది.

మనసును ఎవరో మీటినట్లు
అదశ్యవీణ భూపాలరాగం పలుకుతుంటుంది
భార్యామణి ఇచ్చిన ఆవిర్ల కాఫీ ఆశలను వెదజల్లుతూ ఉంటుంది
వెచ్చని కొత్తఊపిరి వేడుక చేస్తుండగా
ఉదయం మొదలవుతుంది.

నిన్నటి నిరాశను వానచినుకులు కడిగేస్తుండగా
అడుగు పడుతుంది
ఆశలసాగు చేసేందుకు
హృదయకవాటాల ఆరాటంలో
పోరాటాలన్నీ పక్కకు తప్పుకుని
పొయ్యిమీది ఉడికే ఎసరులా
ఆకలితీర్చుకోమని గుడ్ బై చెప్పేస్తాయి
గూడు కట్టుకున్న దుఃఖం
కనులను తుడిచి
సెలవు తీసుకుంటుంది. 

 

-సి.యస్.రాంబాబు

ఇదేరా స్నేహమంటే Previous post ఇదేరా స్నేహమంటే
స్త్రీ మూర్తి Next post స్త్రీ మూర్తి

One thought on “సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close