శాఖ మేత!!

శాఖ మేత!!

చెట్లు పెట్టిన
గుడ్లను తెచ్చి
నాలుగు చీలికలు చేసి
మసాళాలు దట్టించి
చింతపండు పులుసు గుప్పించి
ఉడికించి వండిన
గుత్తి వంకాయ కూరకు సాటి ఏది!

ఆకుపచ్చని సంద్రాన
ఈదుతున్న సొర(కాయలను)
చేపలను పట్టి
కోసి శనగపప్పు తో కలిపి
వండి చేసిన దాల్చా ని తిన్న
నీవు దాల్చుదవు విశ్వరూపము!

పసరిక పాములను(పొట్లకాయలు)పట్టి
పెరుగు పచ్చడి చేసిన
బుస, బుస లాడును కదా
నీ ఆకలి…………..!

మాంసపు ముద్దలను (టమాటా) తెచ్చి
చారు చేసిన
మాయమవ్వును కదరా
నీ మట, మటలు……………!

బర్రె పాలను పితికి
తోడు బెట్టి
గడ్డ పెరుగును ఆరగించిన
గడ్డ కెక్కును కదరా నీ క్షుద్భాధ.

రక్తము చిందని
ఈ కోత, శాఖ మేత!

– వాసు

Related Posts