*శక్తి స్వరూపిణి*
*అమ్మ అనే పిలుపు లోనే ఉంది
అనంతం మైన శక్తి అని
పెదవులు చేసుకునే పుణ్య ఫలం అమ్మా
అమ్మా నువ్వే గా నా ఆశా
అమ్మా నువ్వేగా నా శ్వాస
అమ్మేగా అమ్మేగా ప్రతి బిడ్డ ప్రగతి రథ చక్రాల
అమ్మ వేలే బాటగా
అమ్మ మాటలే తొలి పలుకులు గా
అమ్మ నడకే మా నడకలుగా
అమ్మ చూపే మా కళ్ళు గా
అమ్మ అనే పిలుపు లోనే ఉంది కమ్మని రాగం
అమ్మనే తొలి గురువు గా మారి
బిడ్డను తీర్చి దిడ్డుతూ
తప్పులను సరిదిద్దుతూ
ఓపికను సహనాన్ని నేర్పే నా తొలి గురువు గా
ఎన్నో కష్టాలు పడుతూ
తన రెక్కల కింద పెట్టుకుని కాపాడుతూ
బిడ్డలకొచ్చిన కష్టానికి తల్లడిల్లుతూ
వారికి తానేవిధంగా సాయపడతా నో అని ఆలోచిస్తుంది
తన తల్లి నే దైవంగా పూజిస్తే
తల్లిగా బిడ్డ క్షేమం కోరేది
తల్లేగా తల్లిగా తన గురించి
ఆలోచన లేకుండా పస్తులైన ఉంటూ
బిడ్డల ఆకలి తీర్చే ఆది దేవత
తన కోరికలన్నీ మరిచిపోయి
బిడ్డల క్షేమాన్ని కోరేది.
బిడ్డలు పెద్దయ్యాక పని మనిషిగా నైనా
వారికి దగ్గరగా ఉండాలని కోరుకునేది అమ్మ
ఏన్ని అవమానాలు ఎదురైనా, ఏన్ని ఛీత్కరాలు
పొందినా కిమ్మనకుండా ఉంటూ వారి చేతిలోనే
అసువులు బాయలని కోరుకునేది అమ్మ
అమ్మ ప్రేమను కొలవలేము. అమ్మ నీ పంచుకొలేము
అమ్మ అందర్నీ ప్రేమిస్తుంది, అమ్మ అందర్నీ ఒకేలా చూస్తుంది
బయట నుండి ఎవరైనా అమ్మా అని పిలిచినా పలికే ప్రత్యేక
దేవత, ఎదురుగా కనిపించే నిలువెత్తు రూపం అమ్మా…
అమ్మ ప్రేమను,అమ్మను ఎవరూ కొనలేరు.
తరాలు మారినా అప్పటికి, ఇప్పటికీ ఎప్పటికీ మారనిది అమ్మ ప్రేమ ఒక్కటే…
-భవ్య చారు
అమ్మ నిజంగా శక్తి స్వరూపిణే.