శిధిల జ్ఞాపకాలు

శిధిల జ్ఞాపకాలు

కనికరంలేని కాలం…
కానుకగా ఇచ్చిన…
విధి వంచితమైన
చిధ్రిత బ్రతుకు చిత్రంలో వివర్ణమైపోయిన
నా కోటి ఆశల కుసుమాల
శిధిల జ్ఞాపకాలు..
చిత్రవధ చేస్తూ
అనుక్షణం వేధిస్తూ..
మది మందిరాన్ని..
ముళ్ళ పొదళ్ళా చుట్టుకొని..
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..
చిరకాలపు వేదనలకు
చరమగీతం పాడాలని ఉన్నా..
నిరతం నీ ధ్యాసలో…
నీ రాక కోసం వేచి చూస్తూ..
నిను చేరే క్షణం కోసం…
పరితపిస్తూ…
మోడులా జీవితాన్ని..
నడిపిస్తూనే ఉన్నా..
ఎందుకంటే…
అనివార్యమైన …
ఈ బతుకు నాటకాన్ని…
చివరికంటా..
అభినయించి వెల్లాలని…

చిద్రితము: నలిగిపోయిన
వివర్ణము : రంగులు వెలిసిపోయిన

– మామిడాల శైలజ

Related Posts