శ్రమైక జీవన సౌందర్యం

శ్రమైక జీవన సౌందర్యం

ఉదయ రవికిరణాలు భూమిని తాకకు మునుపే
నిద్దురలేచి పరుగులు పెట్టే కూలీలు
పట్టెడన్నమే పరమాన్నంగా పచ్చడిమెతుకులతో
ఉరుకులు పరుగులు పెట్టుతు సాగిపోతారు

పంట పండిస్తూ ఎండనక వాననక
చీడపీడల ఈతిబాధలకు కృంగిపోక
స్వేదం కరీదు కట్టే షరాబులేని లొకంలో
ఆడుతు పాడుతు సాగిపోయేరు కర్షకులు

సైరన్ కూత వినబడగానే పట్టెడు మెతుకులతో
ఇంట ఇంతి అగచాట్లను వినకుండానే
నిత్యం ఉండే స్తోత్రమేనంటూ సాగిపోయేవు
ఒళ్ళొంచి దినమంతా కష్టించేందుకు
హుషారుగా పాటలు పాడుతు సాగిపోతూ….

దినమొక గండముగా గడిచినా వెరవడతడు
రోజు గడచుట కష్టమైనా చింతించడు
కష్టమే తన శ్వాసగా ఆస్తిగా సాగిపోయేడు
నిత్య కూలీగా మేస్త్రీగా బ్రతికేడు
ఖార్ఖానాలో…ఓడ రేవులో… గనిలో…బడిలో…

సమ్మెట పోటుల చెమటల్లోనా
కరిగే కండల కాయకష్టంలోనా
సౌందర్యమే వెతకి సాగిపోయేడు
శ్రమైక జీవన సౌందర్యానికి
ఖరీదు కట్టే షరాబు లేడంటూ….

 

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts