శ్రమైక జీవితం

శ్రమైక జీవితం

శ్రమలోనే ఆనందం వెతికినా
శ్రమ శక్తికి విలువకట్ట గలమా!
శ్రమజీవులవెతలు తీరేదెప్పుడు

మట్టి అంటినచేతులకు తెలుసు
శ్రమ శక్తి సామర్ధ్యం ఏమిటని

పరిశ్రమలైనా ప్రాజెక్టులైనా
వ్యవసాయమైనా చేతివృత్తు లైనా శ్రమను ధారపోయడమే

కూలీ నాలీ చేసేది కుటుంబ
పోషణకు మాత్రమే

శ్రమ జీవుల చేతులు కదిలితేనే
అందరి అవసరాలు తీరేది

కష్టజీవుల చమట చిందనిదే
సమాజపు పురోగతి లేదు

ఆకలిభాదనుఅదికమించడానికి
కరువు కాలమైనాకష్టకాలమైనా

పెట్టుబడి మాత్రం శరీర శ్రమే
కలలు కూడా కదులుతూనే

వేతనానికి అవసరాలకు మధ్యన యుద్దమే అనునిత్యం

ప్రతీరోజూ ప్రపంచము ముందు
ఎప్పటికీ మరమ్మత్తు లేని యంత్రం శ్రమజీవులే మరి…..?

– జి జయ

Related Posts