శ్రెమైక జీవితం

శ్రెమైక జీవితం

బతుకంతా భారంగా మారుతుంటే
బండరాళ్లలో రక్తం ఇంకి పోతుంటే
చేతులని బండ బారుతుంటే
డోక్కలన్ని ఎగసి పడుతుంటే
ఆయాసం తో గూల్లు ఎగురుతుంటే
సూర్యుడు నడి నెత్తిన నిప్పులు చెరుగుతుంటే
కడుపు లో పేగులన్ని ఉండ చుట్టుకుపోతుంటే
ఏముకలు తేలిన చేతులతో బరువైన సుత్తి చేబట్టి
గంజీ నీళ్లయినా దొరుకుతాయని ఆశతో, ఎడారిలో పక్షిలా ఎదురు చూస్తున్నా ఆశ తో….

– భవ్యచారు

Related Posts