అశ్రునయనాలు

అశ్రునయనాలు

ఎందుకు ఇంత బాధపెడతారు..
మీరెప్పుడు మా మాట విన్నారని…
ఇన్నిరోజులు మిమ్మల్ని చేరుకోవాలని ఆశ…
తీరా చేరే సరికి మిగిల్చారు నిరాశ…
రంగుల ప్రపంచాన
నమ్మకం లేని సమూహన
కావాలని కిందపడేసిన
జనాలకు ఆదర్శమైన
మీరూపం మాకు అపురూపం…..
కష్టం వచ్చిన కన్నిల్లోచ్చిన
పడిలేచిన ప్రతీక్షణాన
మీస్మృతులే మెదిలే మదిలోన
మీ మాటే వేదవాక్కు ప్రతిక్షణానా….
మీతో ఊసులాడాలని
మీ కరచాలనం కావాలని
మీతో మరిన్ని కార్యక్రమాలు చేయాలని
మీ ఆశీర్వాదం కావాలని
మీ దాక వచ్చేసరికి
నిశ్చలముగా….
నిట్టూర్పుగా…..
నిర్జీవంగా….
దర్శనం ఇచ్చావా!
నిన్ను ప్రేమించే మమ్మును కాదని
నువ్వు ప్రేమించే నీవాళ్ళ దగ్గరికి వెళ్ళావా
ఆత్మీయుల హృదయాన
కన్నీటి సంద్రమై
పెళ్లుభికే భావోద్వేగాలతో
కడ సారి వీడ్కోలు
మీ అభిమానిగా
సదా మీ సేవలో……

– హనుమంత

Related Posts