శుభ్రత

శుభ్రత

(మనిషి- మనసు)

శుచి శుభ్రత వున్నచోట
లక్ష్మీ దేవి నివాసం
అంటారు పెద్దలు
మొదటి మార్కు శుభ్రతకు అయినా అతిచేస్తే
నిన్నే వెక్కిరిస్తోంది
అంతకన్నా ఒకటుంది
అదే మనసు మాలిన్యం
అది శుద్ధి చేస్తే అంతా
ఒక వికాసం
మాలిన్యాలు మనసులు
చేతితో భగవతరదనా
ఫలించని కోరికలు
పరిణతి లేని ఆలోచనలు
కుళ్ళ పొడుస్తుంది
ఈ సమాజపు ఇల్లు ఒళ్లు
మూర్ఖత్వానికి మారుపేరుగా
ముంచుతుంది మనసు
మాలిన్యం
సంస్కారం పెంచుకో
సామరస్యం పంచుకో
సదాలోచన వుంచుకో
ఈ మూడు పదాల చుట్టే
తిరుగుతూ వుంటే
అప్పుడే మనిషి మనసు
శుభ్రం పరిశుద్ధం.
– జి.జయ

Related Posts