స్నేహ బంధం 2

 

స్నేహబంధం 2

అబ్బే అలాంటిది ఏమి లేదండి… నాకు కట్నాలు కానుకలు ఏమీ వద్దు, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నాకు జీతం బాగానే వస్తుంది నాకు ఒక సొంత ఇల్లు కూడా ఉంది. మాది విజయవాడ, అక్కడ మాకు పొలం ఉంది అక్క చెల్లెలు అన్న తమ్ములు ఎవరూ లేరు నేను ఒక్కడినే.

నువ్వు ఆగరా వాసు అమ్మాయిని మా పిల్ల వాడికి మీరు పెళ్లి చేస్తే నాకు కూతురు లేని లోటు తీరుతుంది మేము బాగానే చూసుకుంటాం. మీ అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది. మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చితే వచ్చే వచ్చే మార్చిలో పెళ్లి పెట్టుకుందాం. పిల్లల పరీక్షలు అయిపోయి మీ అమ్మాయికి కూడా సెలవులు వస్తాయి కదా… మీరు అంతా ఓకే అనుకుంటే మార్చిలో పెళ్లి చేసేద్దాం అంది పిల్లవాడి తల్లి జానకమ్మ.

పిల్లవాడి తండ్రి సుందరం పిల్లవాడికి పిల్లకు ఓకే అయితే మాకు కూడా మంచిదే ఏమంటారు లక్ష్మణ్ గారు అని అడిగాడు సుధా తండ్రిని. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు అంది అలివేలు. సుధా లేచి తన రూం లోకి వెళ్ళింది. అక్కడున్న తన ఫ్రెండ్స్ అందరూ చుట్టూ మూగి అబ్బాయి నీకు నచ్చాడా అబ్బాయి నచ్చాడా ఎలా ఉన్నాడు, బాగున్నాడా నీకు నచ్చాడా ఎలా ఉన్నాడు అని అడగ సాగారు. సుధా అరుణ కు దగ్గరగా కూర్చుంటూ అబ్బాయి బాగానే ఉన్నాడు నాకు నచ్చాడు నువ్వే చెప్పవే మా అమ్మతో అంది సుధ. అలాగే చెప్తా లేవ్ అంటూ లేచింది. పిన్ని గారు అంటూ పిలిచింది అరుణ ఏమిటమ్మా అంటూ లోనికి వచ్చింది అలివేలు. అబ్బాయి బాగున్నాడు సుధకు నచ్చాడు సుధ సిగ్గు పడుతుంది అందుకే నన్ను చెప్పమన్నది అంది అరుణ.

ఒక్కగానొక్క బిడ్డని నీ సంతోషమే మా సంతోషం తల్లి అంటూ తల్లి సుధా దగ్గరికి వెళ్లి తల నిమిరింది. నిజమెనా నీకు ఇష్టమేనా అని అడిగింది. ఈ విషయం మీ నాన్నగారితో చెప్పమంటావా అంది. చెప్పమ్మా నాకు అబ్బాయి ఇష్టమే అంది సుధ.

అలివేలు బయటకి వచ్చి ఏమండీ ఇలా రండి అంటూ వంటింట్లోకి తీసుకెళ్ళింది లక్ష్మణ్ ను, లక్ష్మణ్ భార్య వెనకాలే వెళుతూ ఏమిటే అమ్మాయి కి నచ్చాడా అంటూ ఆత్రంగా అడిగాడు అవునండి ఈ విషయమే మీకు చెబుదామని పిలిచాను మరి వారికి ఇప్పుడే చెబుదామా అంది అలివేలు.

అబ్బాయికి మన అమ్మాయి కూడా నచ్చింది కదా చెబితే వారు కూడా సంతోషిస్తారు ఇప్పుడే చెబుతాం అంటూ లోపలి నుండి స్వీట్ డబ్బా తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు హాల్లోకి వచ్చారు. బావగారు మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడు నోరు తెరవండి చేసుకుందాం అంటూ స్వీట్ డబ్బా ను టేబుల్ మీద పెట్టి మూత తీసి ఒక లడ్డూ తీసి నోట్లో పెట్టబోయాడు ఆగండి బావ గారు మేము కూడా స్వీట్లు పండ్లు తెచ్చాము అమ్మాయి ని పిలవండి ఒళ్లో పెడతాము అంటూ తాము తెచ్చిన బ్యాగ్ లో నుండి పండ్లు పూలు స్వీట్ డబ్బా తీసి టేబుల్ మీద పెట్టారు. వెళ్ళు వెళ్లి అమ్మాయిని పిలుచుకు రా అలివేలు అన్నాడు లక్ష్మణ్.

అలివేలు సుధా రూమ్ లోకి వెళ్ళింది. అమ్మ సుధా నీకు కాబోయే అత్త గారు రమ్మంటున్నారు రా అమ్మా అంటూ అలివేలు సుధను తీసుకుని బయటకు వచ్చింది. సుధా ను కుర్చీలో కూర్చోబెట్టి అమ్మ సుధ ఈ రోజు నుండి నువ్వు నా కోడలు కాదు కూతురివి అంటూ అత్త గారు బొట్టు పెట్టి ఒళ్లో పండ్లు పూలు పెట్టి స్వీట్ డబ్బా పెట్టి నిన్ను నా కూతురు లాగానే చూసుకుంటాను అంటూ జానకమ్మ అమ్మాయి తల నిమిరింది. సుధా లేచి అత్తగారి కాలు మొక్కింది. ఇంతలో బావా బావా అంటూ ఇద్దరూ లక్ష్మణ్ సుందరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.

మామగారు అయిన లక్ష్మణ్ అబ్బాయి నోట్లో స్వీట్ పెట్టాడు. అయితే మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అంటూ సుందరం అడిగాడు మంచి ముహూర్తం చూసి పెళ్లి పెట్టుకుందాం బావగారు అన్నాడు లక్ష్మణ్. ఇప్పుడు కలిసిపోయాం కదా అయితే టిఫిన్లు కాఫీలు చేస్తారు కదా ఇప్పుడు కలిసిపోయాం కదా మా అమ్మాయి మీ ఇంటి కోడలు అవుతుంది ఇక భోజనాలు చేసేద్దామా అన్నాడు లక్ష్మణ్. లేదండీ బావ గారు ఇక్కడ మా అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళింట్లో భోజనానికి పిలిచారు. అందుకే వద్దు అంటున్నాను. తర్వాత ఎలాగో అందరం కలిసి తింటాము కదా ఇప్పుడు అవన్నీ ఏమి పెట్టుకోవద్దు త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం మీకు బాధ్యత తీరుతుంది మాకూ బాధ్యత తీరుతుంది అంటూ వెళ్ళొస్తామండి ఇక మాకు సెలవు ఇప్పించండి.

అబ్బాయి అమ్మాయి తో మాట్లాడతావా అని అడిగాడు సుందరం. తండ్రి మాటలకు మాట్లాడాలని ఉంది కానీ ఆమె ఫ్రెండ్స్ అంతా ఉన్నారేమో వీలవుతుందో లేదో అన్నాడు వాసు. లేదు బాబు మాట్లాడవచ్చు వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా మీరు పక్క గదిలోకి వెళ్లి మాట్లాడుకోండి అన్నాడు లక్ష్మణ్. ఇంతలో అలివేలు సుధా రూం లోకి వెళ్లి అబ్బాయి నీతో మాట్లాడతారట సుధా ఫ్రెండ్స్ ను మీరు అలా పెరట్లోకి వెళ్తారా అని అంది అలివేలు. అందరూ నవ్వుకుంటూ పెరట్లోకి వెళ్లారు వెనక గది నుండి. అలివేలు బయటకి వస్తూ బాబు వాసు వెళ్ళు అమ్మాయి రూమ్ లో ఉంది వెళ్లి మాట్లాడు అంది అలివేలు. ధైర్యంగా రూమ్ లోకి వెళ్ళిన వాసు నిలబడి ఉన్న సుధ ను చూస్తూ ఏమండీ మీకు నేను నచ్చానా మీరు నాకు చాలా బాగా నచ్చారు అన్నాడు వాసు.

మీరు కూడా నాకు నచ్చారు అంది సుధ. మీరేం చదువుకున్నారు అడిగాడు వాసు. నేను బిఏ చదివాను అంది సుధ. మరి స్కూల్లో టీచరుగా ఎందుకు చేస్తున్నారు. ఇంట్లో ఉంటే బోర్ గా ఉంటుందని నా ఫ్రెండ్ తో కలిసి స్కూల్ లో జాబ్ చూసుకున్నాను. ఇద్దరం ఒకే స్కూల్లో చేస్తాము. నేను స్కూల్ కి వెళ్ళాలంటే రోజు తన ఇంటి ముందు నుంచి వెళ్లాలి. నా ఫ్రెండ్ పేరు అరుణ తను చాలా మంచిది. మరి అంత మంచి అమ్మాయి అయితే నాకు ఎందుకు పరిచయం చేయవు అంటూ వాసు ఆ అమ్మాయిని పిలువు చూద్దాం మాట్లాడతాను అన్నాడు వాసు. వెనకవైపు పెరట్లో ఉన్న వాళ్లకు, వాళ్ల మాటలు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. సుధ రెండు అడుగులు ముందుకు వేసి అరుణా ఇలారా అంది. సుధా వెనకాలే వచ్చిన అరుణ వాసు ను చూస్తూ నమస్కారమండి అంటూ రెండు చేతులు జోడించింది.

మీరు చాలా గొప్ప ఫ్రెండ్స్ అండి సుధా నాకు అన్నీ చెప్పింది అంటున్న వాసుకు, విచిత్రం ఏమిటంటే నేను పుట్టిన రోజూ, అరుణ పుట్టిన రోజూ ఒకటే డేటు. ఇద్దరం కలిసే బర్తుడే చేసుకుంటాము. తనంటే నాకు పంచ ప్రాణాలు అంటున్న సుధ మొఖం చూసాడు వాసు. అరుణ గురించి మాట్లాడుతున్న సుధను చూసి నిజమైన ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారేమో అనుకున్నాడు మనసులో వాసు. చెప్పడం మరిచాను అండి నాకూ ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు కిరణ్ వాడు మొన్ననే హైదరాబాద్ నుండి వచ్చాడు. వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు మమ్మల్ని. మేమిప్పుడు వాళ్ళింటికే వెళ్తున్నాము. వాడు చాలా మంచివాడు. నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, వాడికి కూడా ఇంకా పెళ్లి కాలేదు. అన్నా వదిన ఇక్కడే ఉంటారు.

వాళ్ళకి ఒక పాప కూడా ఉంది, చాలా వరకు హైదరాబాద్ నుండి రావడానికి ఇష్టపడడు ఎందుకంటే ఇంటికి రాగానే ఇంకా ఎప్పుడూ పెళ్లి చేసుకుంటావని వేధిస్తోందని చాలా రోజులు రావడం వదిలేశాడు.

మొన్నీమధ్యనే వచ్చాడని తెలిసింది. వస్తూ వస్తూ దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాము. మా ఇంటికి మీరు తప్పకుండా భోజనానికి రావాలి ఎక్కడికీ వెళ్లొద్దు అని ఒట్టు వేయించుకున్నాడు. చాలా రోజులకు కలవబోతున్నాం కాబట్టి, వాడి మనసు కష్టపెట్టకుండా భోజనానికి వస్తామని ప్రామిస్ చేశాను. చేతికున్న వాచీని చూస్తూ వాసు, అప్పుడే నాలుగున్నర అయ్యింది, తొందరగా వెళ్ళాలి వాడు ఎదురుచూస్తాడు సుధ గారు మీ నంబర్ ఇవ్వండి అంటూ జెబులోనుండి ఫోన్ తీసాడు. సుధా నంబర్ చెప్తూ ఉంటే అతను రాసుకున్నాడు. అతను సుధ ఫోన్ కి మిస్డ్ కాల్ ఇచ్చాడు.

ఇదే నా నంబర్ అండి. మనం తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం వెల్లోస్తానండీ అంటూ అరుణ వైపు చూసి నమస్తే అండి వెల్లోస్తాను, ఈసారి వచ్చినప్పుడు మీతో తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడతాను. మీ ఇంటికి కూడా వస్తాను. సరే వెల్లోస్తానండి అంటూ బయటకి నడిచాడు వాసు. వాసుకొసమే చూస్తున్న తల్లిదండ్రులు కుర్చీలో నుండి లేచి, పదా వెళ్దాం పదరా వాసు వాళ్ళు ఎదురుచూస్తారు అన్న జానకమ్మ మాటలకు, వదినా బొట్టు పెట్టుకొని వెళ్ళండి అంటూ కుంకుమ భరిణె తెచ్చి బొట్టు పెట్టింది జానకమ్మకు . జానకమ్మ కూడా అలివెలు కు బొట్టు పెట్టింది. వాళ్ళను కార్ వరకు సాగనంపి అందరూ లోపలికి వచ్చారు. కారు బయలుదేరింది అంతా లోపలికి వచ్చారు.

నేను వెల్లోస్తానే అక్కడ అమ్మ ఇంట్లో ఎంత కష్ట పడుతోందో అంది అరుణ. ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయారు అనుకుంటూ, నాలుగు గంటలకే వెళ్ళిపొమ్మన్నాను అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో, వెళ్ళాలి తొందరగా అంటున్న అరుణ ను వారిస్తూ, తిని వెళ్ళవే అంది సుధ. లేదే నేను వెళ్ళాలి అంటుంటే అలివేలు క్యారియర్ తో వచ్చి, ఎలాగూ ఈ రాత్రికి వంట చెయ్యకుండా ఈ బాక్స్ తినండి. అన్నీ అన్ని బాక్స్ లో సదిరి పెట్టాను. నేను అమ్మను అడిగాను అని చెప్పు అంది అలివేలు. హ్యాండ్ బ్యాగ్ భుజానికి తెలిగించుకొని, బాక్స్ పట్టుకొని ఇంటికి బయలుదేరింది అరుణ. పది నిమిషాలు నడిచాక ఇంట్లోకి చేరింది అరుణ. వచ్చావా తల్లి, పిల్లలంతా మూడు గంటలకే వెళ్ళిపోయారు, ఆ వచ్చిన అబ్బాయి ఎవరో తెలిసిన అతను వస్తున్నాడు అని అమ్మాయిని తీసుకొని తొందరగా వెళ్ళిపోయాడు.

సర్లే పోతే పోనీ, మళ్లీ రేపు రాకపోతాడా చూద్దాం. వచ్చేవరకు ఉంటానని మాట ఇచ్చాడు కదా సరే పోతే పోనీ నువ్వు వచ్చే సరికి ఎంత లేటవుతుందో ఏమో నేనే వెళ్ళమన్నాను అంది శ్యామల. సర్లే వే కాస్త టీ అయినా పోస్తావా అంది అరుణ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి తల్లి, టీ కప్పుతో ఎదురుగా నిలబడింది అదేమిటి బట్టలు మార్చకుండా టీ తాగుతా అంటావు? నీకున్నది ఇదొక్కటే మంచి చీర, అంది తల్లి, మంచం పై కూర్చుంటూ ఆ రేపు మంచిగా ఉతికి ఇస్త్రీ చేసి పెట్టుకుంటాను అమ్మా అంటూ టీ తాగి గ్లాసు తల్లి చేతికి ఇచ్చి గదిలోకి వెళ్ళింది బట్టలు మార్చుకోవడానికి. చీర విప్పి పక్కన పడేసి నైటీ వేసుకుని బయటకు వచ్చిన కూతురితో ఏమిటే ఇంత పెద్ద బాక్సు తీసుకొచ్చావు అంటూ అడిగింది శ్యామల. సుధా వాళ్ళ అమ్మ మనకు భోజనం పంపించింది. అదేమిటి? అక్కడ నువ్వు భోజనం చేయలేదా? ఏమైంది ఇంతకు? పెళ్లి సంబంధం ఖాయమా అని అడిగిన తల్లికి జరిగిన విషయాలు అన్ని చెప్పింది.

తల్లి పక్కన మంచం పై పడుకొని అన్ని విషయాలు చెప్తున్న కూతురిని చూస్తూ, నువ్వెప్పుడూ పెళ్లి చేసుకుంటా వే మరి? నేనా ఎటూ తిరిగి పిల్లాడిని చూసే పరిస్థితిలో లేను, మనకా చుట్టాలు పక్కాలు ఎవరూ లేరు. ఎవరైనా అబ్బాయి వచ్చి నిన్ను చేసుకుంటా అంటే నేను సంతోషిస్తాను. అలా అంటున్న తల్లిని ఆ ఊరికే వస్తారు మరి, మీ అమ్మాయిని చేసుకుంటా నేను అని ఏ అబ్బాయి అయినా వస్తాడా మన దరిద్రాన్ని చూసి అంటూ విసుక్కుంది అరుణ. తల్లి, కూతురు మాటల్లో పడి రాత్రి ఎనిమిది అయిందన్న విషయమే మర్చిపోయారు. ఇంతలో తన వాచీ చూసుకుంటూ అరుణ, అబ్బో ఎనిమిది అవుతుంది అమ్మా ఆకలిగా ఉంది తిందాం పదా, నువ్వు మందులు వేసుకోవాలి అంటూ లేచి హడావుడి చేసింది అరుణ. బాక్సు తెరచి, అన్ని ప్లేట్లలో ఆడురుకొని ఇద్దరూ తిన్నారు. అన్నీ సర్ది కడిగేసి తల్లికి మందులు ఇచ్చి, తల్లి మందులు వేసుకున్నాక మంచం పక్కనే ఒక చాప వేసుకొని పడుకుంది అరుణ.

-శారద

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *