స్నేహం

స్నేహం

ఎక్కడో  పుట్టాము ఇక్కడ కలిసాము,

స్నేహం అన్నావు 

కలిసి ఉందాం అన్నావు ,

కలగానే మిగిలావు,

కమ్మని ఉసులూ చెప్పావు , కబుర్లతో

కాలాన్ని మరిపించావు,

కవితలెన్నో అల్లావు,  

కళ్ళలో నిలిచావు ,

హట్టాత్తుగా , అర్దాంతరంగా 

కనుమరుగు అయ్యావు,

ఏమయ్యిందని అడిగితే 

సమయం లేదన్నావు 

కాలం కలిసి రాలేదన్నావు 

కబుర్లు లేవన్నావు, 

కవితలు మరిచావు ,

ఆప్పుడర్ధమయ్యింది ,

కలిసి రానిది కాలం కాదని 

కలవాలంటే కలిమితో 

లేని నేనని , నిజమే 

పేదవాడి స్నేహం లాభం కాదని

నీ మాటల వల్లె  తెలిసింది,

ఈ రోజుల్లో స్వచ్చమైన స్నేహం 

ఎడారి ఒయాసిస్సు  అని 

తెలుసుకోలేక పోవడం ముమ్మాటికి 

నా తప్పే అందుకే తప్పుకుంటున్నాను 

మిత్రమా స్నేహం అంటే లాభాల బేరీజు కాదని 

అదొక తీయని అనుభూతని నీవు  తెలుసుకున్న 

రోజే మన స్నేహానికి ఒక అర్ధం పరమార్ధం …. 

నువ్వెక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకునే నీ  నేస్తం …. 

 

Related Posts

3 Comments

  1. నేను సుఖంగానే ఉన్నాను… నువ్వు కూడా సుఖంగా ఉండాలని కోరుకునే

    నీ మిత్రుడు…
    ❤️🥺😊

Comments are closed.