స్నేహమేరా…. జీవితం….

స్నేహమేరా... జీవితం…

భావనే నీవైతే భావం నేను
భుజం మీద నే వాలి
పూల వానలా రాలి
నీవుంటే వేరే కనులెందుకు
లేకుంటే వేరే బ్రతుకేందుకు
మురిపించే మురళి గానం లా
బాపు రమణ, కుచేల కృష్ణ లా
స్నేహం ఒక భావుకత అయితే
నీ లో నేను నా లో నీవు
చేయీ చేయీ కలిపి
ఓల్గా నది ఇసుక తిన్నల్లో
కిన్నరసాని పరువళ్లు లలో
పెన్నా నది ఒడ్డున
గండి కోట గుండెల్లో
ఓ ప్రియ మిత్రమా అని పలకరిస్తే
మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లో
పులకరించే, పలకరించే
స్నేహమా….
అందుకే నీవుంటే వేరే కనులెందుకు అనిపించే
దేర్యమా….
స్నేహం రుచి చూపడానికి
భువి కి దిగిన భగవంతుని రూపమా….
ఇదే వందనాలు
విశ్వం లో వెదజల్లి నా
వెన్నెల వందనాలు.

స్నేహితుల దినోత్సవం సందర్బంగా
అందరికి
హృదయ పూర్వక శుభాకాంక్షలు.

అల్లాఉద్దీన్

Related Posts